Viral Video: హోంవర్క్‌ చేయలేదన్న కారణంతో కూతురి చేతులను తాళ్లతో ఎండలో బంధించిన కసాయి తల్లి

|

Jun 09, 2022 | 5:13 AM

Viral Video: పిల్లలు ఏదైనా చిన్న తప్పు చేసినా దారుణంగా శిక్షిస్తుంటారు కొందరు తల్లులు. హోంవర్క్ చేయలేదని ఓ మహిళ చిన్నారిని కట్టేసింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ,..

Viral Video: హోంవర్క్‌ చేయలేదన్న కారణంతో కూతురి చేతులను తాళ్లతో ఎండలో బంధించిన కసాయి తల్లి
Follow us on

Viral Video: పిల్లలు ఏదైనా చిన్న తప్పు చేసినా దారుణంగా శిక్షిస్తుంటారు కొందరు తల్లులు. హోంవర్క్ చేయలేదని ఓ మహిళ  తన కూతురిని తాళ్లతో  కట్టేసింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. స్కూల్‌ హోం వర్క్‌ చేయనందుకు తల్లి ఆ చిన్నారిని బంధించిన వీడియో సోషల్‌ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. ఈ వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు అప్రమత్తమైన పలు చర్యలు చేపట్టారు. ఈ ఘటన ఢిల్లీలోని కరవాల్‌నగర్‌ ప్రాంతానికి చెందిందని పోలీసులు గుర్తించారు.

 

ఇవి కూడా చదవండి

పాప చేతులు, కాళ్లకు తాడుతో కట్టేసి భవనం పైకప్పుపై పడుకోబెట్టింది. చేతులను విడిపించుకునేందుకు ఆ చిన్నారి నానా అవస్థలు పడుతూ ప్రయత్నాలు చేసింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి