మన హైదాబాద్‌లో ఎర్రగడ్డలా.. ఢిల్లీలో జనపథ్ మార్కెట్ ఉంది. అక్కడ అన్ని వస్తువులు చౌక ధరలకే దొరకుతాయి. దుస్తులు, కిచెన్ ఐటమ్స్, విద్యుత్ ఉపకరణాలు, హస్తకళా శిల్పాలు.. ఇలా ఎన్నెన్నో సరసమైన ధరలకే లభిస్తాయి. అందుకే ఆ మార్కెట్ నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే ఇలాంటి చోట ఓ ప్యాంట్ కొనుగోలు చేసిన మహిళకు చిన్నపాటి లక్ కలిసొచ్చింది.
జనపథ్ మార్కెట్ నుండి తాను ఒక ప్యాంటు కొన్నానని, దాని జేబులో షాకింగ్ విదేశీ నగదు దొరికిందని ఆ మహిళ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. 10 యూరోల తనకు దొరికాయని పేర్కొంది. ఆ యూరోలను భారత కరెన్సీలోకి మారిస్తే దాదాపు 930 రూపాయలు అవుతుంది. ఈ పోస్ట్ వైరల్ అయిన తర్వాత, ప్రజలలో దీని గురించి చాలా చర్చ జరుగుతోంది. నెటిజన్స్ ఫన్నీ కామెంట్లు చేస్తూ తమ స్పందనలు తెలియజేస్తున్నారు. ఒక యూజర్, ‘నువ్వు అదృష్టవంతుడివి, ఇంకో ప్యాంటు కూడా కొనుక్కో’ అని రాశారు. మరొకరు నువ్వు సెకండ్ హ్యాండ్ ప్యాంట్ కొన్నావ్.. అందుకే నీకు ఆ క్యాష్‌బ్యాక్ అని రాసుకొచ్చారు. జన్‌పథ్‌లో సెకండ్ హ్యాండ్ దుస్తులు అందుబాటులో ఉన్నాయని ఈ ఘటనతో రుజువైందని మూడవ వ్యక్తి రాశాడు. ఇంతకీ నువ్ కొన్న ప్యాంట్ ధర ఎంతో చెప్పమని మరికొందరు అడుగతున్నారు. కాగా అండోరా, మొనాకో, శాన్ మారినో, వాటికన్ సిటీలు యూరోను తమ జాతీయ కరెన్సీగా ఉపయోగిస్తున్నాయి.
Guys I found 10 euros in the pant I bought @ janpath today pic.twitter.com/gp1Jk0KukV
— naina (@asapismyjesus) March 21, 2025
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..