
డిసెంబర్ 30, 2025న న్యూఢిల్లీ నుండి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన తోటి ప్రయాణికులై మూత్ర విసర్జన చేసినట్టు ఆరోపిస్తూ.. శివమ్ రాఘవ్ అనే కంటెంట్ క్రియేటర్ తన ఇన్‌స్ట్రాగ్రామ్ హ్యాండింల్‌లో ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కాస్త వైరల్ కావడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. బిజినెస్ క్లాస్ తోటి ప్రయానిణికుల పట్ల సదురు వ్యక్తి ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘చెత్త అనుభవాలలో ఒకటి’
తన ఇన్‌స్ట్రాలో ఈ పోస్ట్ చేస్తూ శివమ్ రాఘవ్ ఇలా రాసుకొచ్చాడు. తన జీవితంలో తాను చేసిన విమాన ప్రయాణాల్లో అత్యతం చెత్త ప్రయాణం ఇదేనని శివమ్ పేర్కొన్నాడు. వన్-వే టికెట్ కోసం దాదాపు రూ. 80,000 ($1,000) ఖర్చు చెల్లించినప్పటికీ ఈ ప్రయాణం చెత్త అనుభూతిని మిగిల్చిందని శివమ్ రాసుకొచ్చాడు. తాగిన మత్తులో తాను ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా.. ఓ వ్యక్తి బాత్‌రూమ్ నుంచి బయటకు వస్తూ.. తన పక్కనే ఉన్న ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేసినట్టు శివమ్ ఆరోపించాడు. ఆ వ్యక్తి తీరు క్యాబిన్ మొత్తాన్ని గందరగోళానికి గురిచేసిందని పేర్కొన్నాడు.
వీడియో చూడండి.
Indians aren’t just a nuisance on the ground but also in the air
An Indian passengers urinated on fellow passengers in an air India flight
Never fly air India
Never fly to India …..
Most Indians have no concept of civic sense
Air India should stop serving alcohol onboard… pic.twitter.com/pirDxj4LQm
— 🦉 (@macroschema) December 29, 2025
ప్రయాణీకుల భద్రతపై ప్రశ్నలు
నివేదికల ప్రకారం.. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో బిజినెస్ క్లాస్‌లో అమ్మాయిలు ఎవరూ లేరు. అదే ఒకవేళ ఒక మహిళ ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఆమెకు సంఘటన ఎదురైతే.. ఆమె మరోసారి ఇలాంటి ప్రయాణం ఎలా చేయగలదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బిజినెస్ క్లాస్ ఇంత నీచంగా ప్రవర్తించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.