Viral News: ఇవేం వింత కోరీకలు తల్లీ.. ఇంటికొస్తున్నానని చెప్పి మరీ ఇలా అడుగుతారా.? లిస్టు చూసి తండ్రి షాక్..

ఇంటికి దూరంగా ఉంటూ.. హాస్టల్‌లో చదువుకునే పిల్లలు హోమ్లీ ఫుడ్ ఎప్పుడు తింటామా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఇంటికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ.. మంచి మంచి వంటకాలు వండి పెట్టడానికి రెడీగా..

Viral News: ఇవేం వింత కోరీకలు తల్లీ.. ఇంటికొస్తున్నానని చెప్పి మరీ ఇలా అడుగుతారా.? లిస్టు చూసి తండ్రి షాక్..
Daughter, Father Relationship (representative Image)

Updated on: Dec 13, 2022 | 12:33 PM

ఇంటికి దూరంగా ఉంటూ.. హాస్టల్‌లో చదువుకునే పిల్లలు హోమ్లీ ఫుడ్ ఎప్పుడు తింటామా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఇంటికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ.. మంచి మంచి వంటకాలు వండి పెట్టడానికి రెడీగా ఉంటారు. కొంతమంది అయితే.. నేను ఇంటికి వస్తున్నా.. ఏం వండుతారు అమ్మ వెరైటీస్ అని ఫోన్లో అడగడం కూడా చూస్తూ ఉంటాం. పిల్లలు ప్రేమతో అడుగుతారు కాబట్టి.. నీకు ఏం కావాలన్నా వండుతా అంటూ అంతే ప్రేమతో చెప్తారు. పిల్లలు, పేరెంట్స్ మధ్య ఉండే ప్రేమ అలాగే ఉంటుంది. హాస్టల్‌లో ఫుడ్ తిని బోర్ కొడుతూ ఉంటుంది. అక్కడ వడ్డించిన మెనూనే తినాలి. కావల్సినది వడ్డించరు. టెస్ట్ కూడా అంతంత మాత్రమే.. దీంతో చాలా మంది ఇంటికి ఎప్పుడు వెళ్తామా, మంచి ఫుడ్ ఎప్పుడు లాగించేద్దామా అని ఎదురుచూస్తూ ఉంటారు. సాధారణంగా ఓ వయసు వరకు ఇలాంటి కోరికలు ఉంటాయి. చదువుకునే పిల్లలు అయితే.. తినే వయసు కాబట్టి తల్లిదండ్రులు కూడా కావల్సినవి అడిగి పెడుతుంటారు. కాని ఓ అమ్మాయి మాత్రం రోటిన్‌కు భిన్నంగా తాను ఇంటికి వెళ్లేందుకు నాలుగు రోజుల ముందు.. తనకు ఏం వెరైటీలు కావాలో ఓ లిస్టు తండ్రికి వాట్సప్‌లో పంపింది. అవి చూసిన తండ్రి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శిక్ష అనే ఈ అమ్మాయి మాత్రం ఇంటికి రావాడానికి నాలుగు రోజుల ముందే ఓ పెద్ద లిస్టును తన తండ్రికి వాట్సాప్‌ చేసింది. డిసెంబరు 16న ఇంటికి వస్తున్నానని, తాను వచ్చే సరికి ఏయే వంటకాలు రెడీ చెయ్యాలో చెప్పింది. చికెన్‌ కబాబ్‌ నుంచి మటన్‌ బిర్యానీ, ఫిష్‌ టిక్కా ఇలా ఓ పెద్ద జాబితాను తండ్రికి పంపింది. ఒకింత ఆశ్చర్యానికి గురైన తండ్రి శ్వేతన్క్‌ సరదాగా ఆ లిస్ట్‌ను ట్విటర్‌లో పోస్టు చేశారు. దీంతో అది వైరల్‌గా మారింది. అయితే ఆ అమ్మాయి ఇంటి నుంచి హాస్టల్‌కు వెళ్లి సంవత్సరాలు కూడా కాలేదు. జస్ట్ ఒక ఐదు నెలలే అయింది. ఐదు నెలలకే ఇంత లిస్ట్ పెడితే.. ఐదేళ్లయితే.. ఇంకేత లిస్టు పెడుతుందో అంటూ ఈ పోస్టుపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.

ఈ సరదా ట్వీట్‌పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. గతంలో మా అమ్మాయి ఇలాగే లిస్టు పెట్టేది. ఇప్పుడామెకు 8 ఏళ్ల వయస్సున్న కొడుకు కూడా ఉన్నాడు. కానీ, ఆ అలవాటు మాత్రం పోలేదు.. పైగా వాళ్ల భర్త, కొడుకకు కావాల్సిన లిస్టు కూడా దీనికి జతకలిసింది అంటూ ఓ నెటిజన్ కామెంట్‌ చేస్తే.. ఇలా చేస్తే, మా అమ్మ, నానమ్మ చెప్పుల వర్షం కురిపిస్తారంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..