డేర్ డెవిల్ స్టంట్.. దుబాయ్ నింగిలో.. మరో ‘ఐరన్ మ్యాన్’

| Edited By: Anil kumar poka

Feb 19, 2020 | 2:30 PM

దుబాయ్ లో డేర్ డెవిల్ స్టంట్స్ చూసి తీరాల్సిందే.. రియల్ ఐరన్ మ్యాన్ అయిన విన్స్ రెఫెట్ విన్యాసాలు ఒళ్ళు గగుర్పొడిచేలా సాగాయి.

డేర్ డెవిల్ స్టంట్.. దుబాయ్ నింగిలో.. మరో ఐరన్ మ్యాన్
Follow us on

మార్వెల్ సంస్థ తీసిన హాలీవుడ్ మూవీ ‘ ఐరన్ మ్యాన్’ అందరికీ గుర్తుండే ఉంటుంది. భూమికి చాలా అడుగుల ఎత్తున హీరో ఆకాశంలో చేసే స్టంట్స్ వావ్ అనిపిస్తాయి. చిన్నా, పెద్దా అంతా అత్యంత ఆసక్తిగా చూసిన ఆ చిత్రంలోని సన్నివేశాలు ఇప్పటికీ అలరిస్తాయి. అది సినిమా అయితే.. ఇప్పుడు రియల్ హీరో ఒకరు వాస్తవంగా ఆ స్టంట్ చేసి చూపాడు. ఒళ్ళు గగుర్పొడిచేలా చేశాడు. దుబాయ్ లోని జెట్ మ్యాన్ ‘నిజంగా’ మరో ఐరన్ మ్యాన్ అయ్యాడు. అతడే విన్స్ రెఫెట్.. భూమికి 1800 మీటర్ల ఎత్తున.. సముద్ర తీరం నుంచి మొదలుపెట్టి.. అతి ఎత్తయిన బుర్జ్ ఖలీఫా వరకు, ప్రపంచంలోనే భారీ విమానమైన ‘ఎమిరేట్స్ ఎయిర్ బస్..ఏ 380’ వరకు అలా. అలా గాల్లో తేలుతూ విన్యాసాలు చేశాడు. జెట్ ఫ్యాక్స్, కార్బన్ ఫైర్ వింగ్స్ వగైరా స్పేస్ సూట్స్ ధరించి అలవోకగా అతగాడు చేసిన ఈ విన్యాసం చూసితీరాల్సిందే. ఈ వీడియో వైరల్ అయిందంటే అవదూ మరి ?