Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. బొరియలోకి దూరేందుకు ఈ పాము ఏం చేసిందో చూడండి

|

Feb 24, 2022 | 1:52 PM

Snake Trending Video: ఇంటర్నెట్‌లో రోజూ పదులు సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. రకరకాల ఫన్నీ వీడియోలతో పాటు యానిమల్స్‌కు సంబంధించిన కంటెంట్ కూడా ట్రెండ్ అవుతుంది.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. బొరియలోకి దూరేందుకు ఈ పాము ఏం చేసిందో చూడండి
Snke Viral Video
Follow us on

Snake Video: ఇంటర్నెట్‌(Internet)లో రోజూ పదులు సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. రకరకాల ఫన్నీ వీడియోలతో పాటు యానిమల్స్‌కు సంబంధించిన కంటెంట్ కూడా ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా పాములకు సంబంధించిన  వీడియోలు చూసేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తారు. ప్రజంట్ పాములకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే షాకింగ్ వీడియోల వరకు ఎన్నో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో షాకింగ్ వీడియో సోషల్ మీడియా(Social Media)లో ట్రెండ్ అవుతోంది. ఇందులో ఓ పెద్ద పాము కడుపులో గుడ్లు ఉండడం వల్ల ఇరుకైన ప్రదేశంలోకి వెళ్లేందుకు ఇబ్బంది పడింది. దీంతో అప్పటికే మింగిన పెద్ద పెద్ద గుడ్లను బయటకు కక్కేసింది. ఈ వీడియో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తుంది. వీడియోను గమనిస్తే.. పాము కొద్దిసేపటి క్రితం వేటాడి పక్షి గుడ్లను తిన్నట్లు తెలుస్తోంది. కడుపులో గుడ్లు ఉండటంతో దాని పొట్ట భాగం లావుగా మారింది. ఈ క్రమంలోనే అది ఇరుకైన బొరియలోని దూరడానికి ప్రయత్నించింది. కానీ పొట్ట భాగం లావుగా ఉండటంతో వీలుకాలేదు. దీంతో పాము మింగిన గుడ్లన్నింటినీ ఒక్కొక్కటిగా కక్కడం ప్రారంభించింది. నాలుగు గుడ్లను కక్కిన అనంతరం అది సులభంగా బొరియలోకి ప్రవేశించింది.

వైరల్ వీడియో దిగువన చూడండి-

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. కేవలం 24 గంటల్లోనే లక్షలాది మంది వీక్షించారు. వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి. ఈ వీడియో టర్కీ నుంచి వచ్చినట్లు తెలుస్తుంది. దీన్ని చూసిన అనంతరం.. వామ్మో ఇంత తెలివైన పామును చూడలేదు అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

Also Read: Hyderabad: ఫ్యాన్సీ నెంబర్లకు యమ డిమాండ్​.. 9999 ఎంత పలికిందో తెలిస్తే మైండ్ బ్లాంక్

తెల్ల వెంట్రుకలను పీకేస్తే… అవి రెట్టింపు అవుతాయంటారు.. ఇది వాస్తవమేనా…?