Viral Video: ఈ పిల్లి టాలెంట్ అదుర్స్.. ఏకంగా మట్టి పాత్రలనే తయారు చేస్తోందిగా.. వీడియో వైరల్..

|

Apr 18, 2022 | 3:40 PM

మాటలు నేర్చుకునే రామ చిలుకలను చూశాం.. డ్యాన్స్ చూస్తూ చేసే బాతులను చూశాం. అంతే కాదు నవ్వులు పూయించే కోతుల సందడిని కూడా మనం సోషల్ మీడియాలో చూశాం. అయితే ఇప్పుడు ఓ పిల్లి కుండలను తయారు చేయడం..

Viral Video: ఈ పిల్లి టాలెంట్ అదుర్స్.. ఏకంగా మట్టి పాత్రలనే తయారు చేస్తోందిగా.. వీడియో వైరల్..
Little Cat Learns How To Ma
Follow us on

మనం ఇంతవరకు మాటలు నేర్చుకునే రామ చిలుకలను చూశాం.. డ్యాన్స్ చూస్తూ చేసే బాతులను చూశాం. అంతే కాదు నవ్వులు పూయించే కోతుల సందడిని కూడా మనం సోషల్ మీడియాలో చూశాం. ఇలాంటి ఎన్నో వింతైన విడియోలను సోషల్ మీడియాలో తెగ చూశాం. అయితే.. ఈ మధ్య ఓ విడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్(Viral Video) అయిన ఈ వీడియోలో ఒక చిన్న పిల్లి కుండను ఎలా తయారు చేయాలో నేర్చుకుంటుంది. అవును.. మీరు చదవుతున్న నిజమే, తమాషా కాదు. చిన్న పిల్లి కుండలు చేసే చక్రంపై ఉన్న మట్టి ముద్దను తాకడం.. సరిగ్గా ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ వీడియోకు 14 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అత్యంత తక్కువ సమయంలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుందని చెబితే మీరు నమ్ముతారా? అవును, వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంది. బ్యూటెంగెబిడెన్ ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేయబడింది.

ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి కుండల చక్రంపై మట్టికి ఆకృతి ఇవ్వడం.. ఇది చూసిన కుతూహలంతో పిల్లి రెడీ అవుతున్న కుండను తన ముందు కాళ్లతో టచ్ చేయడం.. చక్రం మీద ఉన్న మట్టి నమూనాను తాకడం ప్రారంభించింది. “పాటరీ క్యాట్ (sic)” అంటూ ఈ వీడియోకు శీర్షికను జోడించారు.

ఈ వీడియో చూసిన తర్వాత ట్విట్టర్ యూజర్లు సరదా మీమ్స్, ఫన్నీ క్యాట్ వీడియోలను షేర్ చేస్తున్నారు. వాటిలో కొన్నింటిని ఇక్కడ చూడండి:

ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు..? దిగువ కామెంట్ బాక్స్‌‌లో మాకు చెప్పండి.

ఇవి కూడా చదవండి: Prashant Kishor: అక్కడ దోస్తీ.. ఇక్కడ కుస్తీ.. తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిశోర్‌తో పరేషాన్!

KGF 2 Collection: బ్రేకులు లేని బుల్డోజర్‌లా దూసుకుపోతున్న యశ్.. సునామీలా కలెక్షన్స్