Viral Video: రోడ్డు దాటుతున్న ఎలుక.. వెనకాలే వచ్చిన కాకి.. ఏం చేసిందో తెలుసా.. వైరల్ వీడియో..

|

Mar 17, 2022 | 6:00 AM

ఇప్పుడు ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా.. వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే ఈ వీడియో మనుసు కదిలించేదిగా ఉంది...

Viral Video: రోడ్డు దాటుతున్న ఎలుక.. వెనకాలే వచ్చిన కాకి.. ఏం చేసిందో తెలుసా.. వైరల్ వీడియో..
Viral Video
Follow us on

ఇప్పుడు ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా.. వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే ఈ వీడియో మనుసు కదిలించేదిగా ఉంది. వీడియోలో ఒక ఎలుక(Rat) రద్దీగా ఉండే రోడ్డు దాటడానికి ప్రయత్నించింది. అయితే అప్పుడే ఓ కారు వేగంగా వచ్చింది. ఇక ఎలుక పని అయిపోందని అన్నుకున్నారు అంతా.. కానీ అప్పుడే అపద్భాంధవుడిలా ఓ కాకి(Crow) వచ్చి ఎలుకను కాపాడింది. కాకి చాకచక్యంగా ఎలుకను కాపాడిని విధానం అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌(Viral Video) అవుతుంది.

ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ఈ హృదయాన్ని హత్తుకునే వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. క్యాప్షన్‌ చాలా ఫన్నీ రాశారు. ‘తప్పుదారిలో వెళ్లకుండా ఎవరు అడ్డుకుంటారో వారే మీ నిజమైన స్నేహితుడు’ అని రాశారు. ఒక స్నేహితుడు తప్పు మార్గంలో నడుస్తున్నట్లయితే, అతనిని తప్పు మార్గంలో వెళ్లకుండా ఆపడానికి ఒక స్నేహితుడు ఉండాలి అనేది దీని అర్థంగా ఉంది.

ఈ 12 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 36 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను కూడా లైక్ చేశారు. అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు. ‘ఇది చాలా అందమైన దృశ్యం’ అని ఒక వినియోగదారు రాయగా, మరొక వినియోగదారు ఎలుక కాకి ముక్కగా మారలేదని సరదాగా రాశారు.

Read Also.. Watch Video: అబ్బా.. ఏం పట్టింది.. ఇది క్యాచ్ కాదు అంతకు మించి.. లేడీ రోడ్స్ అంటూ నెటిజన్ల కామెంట్స్..