
సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. ఇక జంతువుల వీడియోలు అయితే జనాలు ఆసక్తిగా చూస్తారు. తాజాగా ఓ చిరుత, ఆవుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్థాన్‌లో ఈ ఘటన జరిగింది. ఇది తల్లి ధైర్యంగా పులిని ఎదురించి బిడ్డను రక్షించుకున్న ఘటన. ఈ వీడియోలో.. ఒక చిరుతపులి ఆవు దూడపై దాడికి దిగింది. ఇది చూసిన దూడ తల్లి.. దూరం నుంచి పరిగెత్తుకొచ్చి.. తన ప్రాణాలను కూడా పట్టించుకోకుండా పులికి ఎదురుతిరిగింది. దీంతో భయపడడం పులి వంతైంది.
ఆవు యొక్క ఉగ్ర రూపాన్ని చూసి భయపడిన చిరుత వెంటనే అక్కడి నుండి పారిపోయింది. ఆవు సరైన సమయంలో స్పందించకపోతే, దూడ చిరుతకు ఆహారంగా మారేది. ఈ ఘటన పాలిలో ఉన్న జవాయి చిరుత సాంక్చురీలో జరిగింది. ఓ వ్యక్తి దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. ‘‘ఒక చిరుతపులి ఆవు దూడపై దాడికి దిగింది. అప్పుడు తల్లి ఎటువంటి భయం లేకుండా దూడను కాపాడటానికి పరిగెత్తింది” అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన తర్వాత, నెటిజన్లు ఆవు ధైర్యం, తల్లి ప్రేమను ప్రశంసిస్తున్నారు. ప్రపంచంలో అన్నింటికన్నా తల్లి ప్రేమే విలువైనదని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
पाली के बाली में गाय के बछड़े को गर्दन से पैंथर ने
दबोचा तो बछड़े को बचाने #मां (गाय) बिना कोई
भय के दौड़ पड़ी। #Rajasthan pic.twitter.com/Bfjylq4lpP— अवधेश पाकड़🇮🇳 (@AvPakad) August 1, 2025
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..