Video: అడవికి రాజైనా.. భార్య ముందు జుజుబీనే..!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఒక ఆడ సింహం మగ సింహంపై దాడి చేస్తున్న దృశ్యం చూపించబడింది. ఆడ సింహం ఉగ్ర దాడితో మగ సింహం రోడ్డు పక్కన ఉన్న గుంటలో పడిపోతాడు. ఈ ఘటనకు సంబంధించిన నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియాలో రెండు సింహాలు పోట్లాడుకుంటున్న ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక ఆడ సింహం, ఒక మగ సింహం మధ్య ఫైట్ జరుగుతున్నట్లు చూడొచ్చు. ఇందులో ఫన్నీ థింగ్ ఏంటంటే.. ఆడ సింహం దెబ్బకు మగ సింహం ముఖం ఎలా మారిపోయింది. ఆడ సింహం ఎందుకో విపరీతమైన కోపంతో ఉంది. గోళ్ళతో మగ సింహంపై దాడి చేస్తోంది. ఆ దెబ్బకు ‘అడవి రాజు’ అయిన మగ సింహం బోల్తా పడి నేరుగా రోడ్డు పక్కన ఉన్న గుంటలో పడిపోతాడు. ఈ వీడియో చూసిన వాళ్లు అడవి రాజైనా భార్య ముందు జుజుబీనే అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. కింద ఉన్న వీడియో మీరు కూడా చూసేయండి..
His shocked face 😂😂 pic.twitter.com/WefsOe46K1
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 3, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
