గ్యాంగ్ రేప్ కేసులో సంచలన తీర్పు

న్యూఢిల్లీ: సామూహిక హత్యాచారం కేసులో పంజాబ్‌, హర్యానా హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఏడుగురికి మరణశిక్షను ఖరారు చేసింది. దీంతోపాటు రూ.50లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇందుకు నేరస్థుల ఆస్తులను విక్రయించాలంటూ ఆదేశించింది. ఈ మేరకు రోహతక్‌ డిప్యూటీ కమిషనర్‌కు కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. కాగా నేపాల్‌కు చెందిన మహిళపై 2015, ఫిబ్రవరిలో రోహతక్‌లో అతిక్రూరంగా సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు. మతి స్థిమితం లేని ఆమె , రోహతక్‌లోని సోదరి ఇంటికి వచ్చి కనిపించకుండా పోయింది. మూడు […]

గ్యాంగ్ రేప్ కేసులో సంచలన తీర్పు

Updated on: Mar 20, 2019 | 2:49 PM

న్యూఢిల్లీ: సామూహిక హత్యాచారం కేసులో పంజాబ్‌, హర్యానా హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఏడుగురికి మరణశిక్షను ఖరారు చేసింది. దీంతోపాటు రూ.50లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇందుకు నేరస్థుల ఆస్తులను విక్రయించాలంటూ ఆదేశించింది. ఈ మేరకు రోహతక్‌ డిప్యూటీ కమిషనర్‌కు కోర్టు కీలక ఆదేశాలిచ్చింది.

కాగా నేపాల్‌కు చెందిన మహిళపై 2015, ఫిబ్రవరిలో రోహతక్‌లో అతిక్రూరంగా సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు. మతి స్థిమితం లేని ఆమె , రోహతక్‌లోని సోదరి ఇంటికి వచ్చి కనిపించకుండా పోయింది. మూడు రోజుల అనంతరం దారుణ హింసకు గురైన స్థితిలో తీవ్ర గాయాలతో ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.