
వర్షం పడితే పట్టణాలన్నీ ఆగమాగమవుతాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవడం, రోడ్లపై నీరు నిలవడం, వాహనదారుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇటీవలే హైదరాబాద్‌లో కురిసిన వర్షాల అల్లకల్లోం సృష్టించింది. రోడ్లపై భారీగా వరద నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు.. దేశంలోని ముఖ్య పట్టణాల పరిస్థితి ఇదే. ఢిల్లీ, గురుగ్రామ్, కోల్‌కతా, ముంబై వంటి నగరాల్లో గత కొన్ని రోజులుగా కుండపోత వానలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలదిగ్బంధమై.. ప్రజల తీవ్ర అవస్థలు పడ్డారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సమస్యలకు పరిష్కారమేంటీ..? అన్నది అందరిలో ఉత్పన్నమవుతున్న ప్రశ్న. దీనికి సంబంధించి ఏఐ ఓ అద్భుత పరిష్కారం చూపిస్తోంది.
వరద నీటి వ్యవస్థకు సంబంధించిన ఏఐ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వరద నీరు రోడ్లపై నిలవకుండా ఏం చేయొచ్చో ఈ వీడియో లో ఉంది. వరద రహిత రోడ్లు, వీధుల కోసం స్మార్ట్ డ్రెయిన్‌లు, వర్షపు నీటి నిల్వ వ్యవస్థలు, వాతావరణ పర్యవేక్షణతో కనెక్ట్ అయిన ట్రాఫిక్ కంట్రోల్ టవర్లు ఉన్నాయి. ప్రత్యేక రెయిన్ కమాండ్, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్, వర్షపు నీటి నిల్వ ట్రాకర్లతో కూడిన ఎకో బస్ స్టాప్‌లు, హౌసింగ్ సొసైటీలలో రూఫ్‌టాప్ వర్షపు నీటి సేకరణ వంటివి ఆచరణాత్మకంగా ఎలా చేయవచ్చో ఈ వీడియో వివరిస్తుంది.
‘‘భారత్ వరద నీటితో సమస్యలు ఎదుర్కొంటున్న వేళ.. ఏఐ విన్నూత్న నీటి నిల్వ వ్యవస్థను తెరమీదకు తెచ్చింది. అదనపు వర్షాన్ని వనరుగా మార్చడానికి పురాతన జ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో మిళితం చేసింది’’అనే ట్యాగ్ లైన్‌తో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఏఐ వీడియో అద్భుతంగా ఉందని.. ప్రభుత్వాలు ఇటువంటి వ్యవస్థను తీసుకొస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇటువంటివి చేయకుండా ప్రభుత్వాలను ఎవరు ఆపుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..