‘టిక్‌టాక్’ చేసిన పోలీసమ్మ.. ఉద్యోగం ఊడగొట్టుకుంది

| Edited By:

Jul 25, 2019 | 11:39 AM

‘టిక్‌టాక్’ .. ఈ పేరుకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ వీడియో స్ట్రీమింగ్ యాప్‌కు అతుక్కుపోతున్నారు. ముఖ్యంగా తమ టాలెంట్‌ను చూపించాలనుకుంటోన్న కొంతమంది మేకప్‌లు వేసుకొని మరీ అందులో వీడియోలు చేస్తున్నారు. అయితే ఈ యాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌నే కాదు.. అనేక అనర్థాలను కూడా తీసుకొస్తోంది. దీని వలన కొంతమంది ప్రాణాలు కోల్పోతే.. మరికొందరు తమ ఉద్యోగాలనే కోల్పోతున్నారు. తాజాగా టిక్‌టాక్ వీడియో చేసి తన ఉద్యోగాన్ని కోల్పోయింది […]

‘టిక్‌టాక్’ చేసిన పోలీసమ్మ.. ఉద్యోగం ఊడగొట్టుకుంది
Follow us on

‘టిక్‌టాక్’ .. ఈ పేరుకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ వీడియో స్ట్రీమింగ్ యాప్‌కు అతుక్కుపోతున్నారు. ముఖ్యంగా తమ టాలెంట్‌ను చూపించాలనుకుంటోన్న కొంతమంది మేకప్‌లు వేసుకొని మరీ అందులో వీడియోలు చేస్తున్నారు. అయితే ఈ యాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌నే కాదు.. అనేక అనర్థాలను కూడా తీసుకొస్తోంది. దీని వలన కొంతమంది ప్రాణాలు కోల్పోతే.. మరికొందరు తమ ఉద్యోగాలనే కోల్పోతున్నారు. తాజాగా టిక్‌టాక్ వీడియో చేసి తన ఉద్యోగాన్ని కోల్పోయింది ఓ మహిళా పోలీస్.

గుజరాత్‌కు చెందిన అర్పితా చౌదరి అనే మహిళా పోలీస్.. మెహ్సానా జిల్లాలోని లంగన్ స్టేషన్‌లో పనిచేస్తోంది. ఇటీవల ఆమె ఓ పాటకు టిక్‌టాక్ చేసింది. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో.. ఆమెపై వేటు పడింది. దీనిపై డీఎస్పీ మంజితా వంజరా మాట్లాడుతూ.. ‘‘అర్పితా రూల్స్‌ను బ్రేక్ చేసింది. డ్యూటీలో ఉండి కూడా ఆమె యూనిఫాం వేసుకోలేదు. అంతేకాకుండా స్టేషన్‌లో ఆమె వీడియోను తీసుకుంది. పోలీసులు కచ్చితంగా క్రమశిక్షణను పాటించాలి. అర్పితాకు క్రమశిక్షణ లేదు అందుకే సస్పెండ్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. కాగా 2016లో అర్పితా పోలీస్ శాఖలో తన ఉద్యోగాన్ని మొదలుపెట్టింది. 2018లో ఆమె మెహ్నాసా జిల్లాకు బదిలీ అయ్యింది.