Viral Photo: ఈ ఫోటోలో ఉన్నది తెలుగు రాష్ట్రాల్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు.. ఎవరో గుర్తించారా..?

|

Feb 23, 2022 | 8:36 PM

ఇంటర్నెట్.. ఇప్పుడు దేశంలోని ప్రతి మూలకు విస్తరించింది. సెలబ్రిటీలు, స్పోర్ట్ స్టార్స్, పొలిటికల్ లీడర్స్.. తమ ఫ్యాన్స్ ను, ఫాలోవర్స్ ను రీచ్ అయ్యేందుకు ఇంటర్నెట్ బాగా ఉపయోగపడుతుంది.

Viral Photo: ఈ ఫోటోలో ఉన్నది తెలుగు రాష్ట్రాల్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు.. ఎవరో గుర్తించారా..?
Viral Photo
Follow us on

Trending Photo: ఇంటర్నెట్… ఇప్పుడు దేశంలోని ప్రతి మూలకు విస్తరించింది. దీనివల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో, అనర్థాలు కూడా అన్నే ఉన్నాయి. ఆ విషయం ప్రస్తుతానికి పక్కన పెడితే.. సెలబ్రిటీలు, స్పోర్ట్ స్టార్స్, పొలిటికల్ లీడర్స్.. తమ ఫ్యాన్స్ ను, ఫాలోవర్స్ ను రీచ్ అయ్యేందుకు ఇంటర్నెట్ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్.. తాము చేసే అభివృద్ధి పనులు, సామాజిక సేవా కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు.. సోషల్ మీడియా వేదికలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇక ఫాలోవర్స్ కూడా నేతలను బాగా హైప్ చేస్తున్నారు.  ఈ క్రమంలోనే అటు సినిమా స్టార్స్, పొలిటికల్ లీడర్ల.. ఫోటోలు నెట్టింట వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. అందులో ముఖ్యమైనవి వారి చిన్ననాటి ఫోటోలు. సదరు ఫోటోలలో ఆయా వ్యక్తులను చూసి.. వారు ఇప్పుడు ఫలానా అంటే చాలామంది గుర్తించలేకపోతున్నారు. ఈ క్రమంలో ఓ ఫోటో ప్రజంట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులోని ఇద్దరు వ్యక్తులు.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలా శక్తివంతమైన వ్యక్తులు. పై ఫోటోలో ఉంది ఎవరో మీరు గుర్తించారా..? లేదు కదూ.. మీరే కాదు.. నూటికి 90 మంది ఆ ఫోటోలో ఉంది ఎవరో కనిపెట్టలేకపోతున్నారు. ఇక మేమే చెప్పేస్తాం. ఆ ఫోటోలో ఉంది.. ఏపీ సీఎం జగన్, ఆయన సోదరి, వైఎస్సారిటీపీ అధ్యక్షురాలు షర్మిల. నమ్మశక్యంగా లేదు కదూ..! కానీ మేము చెప్పేదినూటికి 100 శాతం నిజం. ఇది వారు చిన్నతనంలో దిగిన ఫోటో.

తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత.. కొన్నాళ్లు కాంగ్రెస్ లో ఉండి.. 2011లో ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ’   పెట్టి.. కేసులను ఎదుర్కొని.. రాష్ట్రమంతటా పాదయాత్ర చేసిన జగన్.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ చరిత్రలో ఎవరూ సాధించలేని అద్భుతమైన ఘన విజయాన్ని అందుకున్నారు. ఏకంగా 151 స్థానాల్లో గెలుపొంది.. రికార్డు క్రియేట్ చేశారు. తన తండ్రి అడుగుజాడల్లో పేదప్రజలకు సేవ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక షర్మిల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు… 2012లో ఆస్తుల కేసుల్లో జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేయగా.. 16 నెలలు జైల్లో ఉన్నారు. జగన్ లేకపోయినా విజయమ్మ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ముందుకు సాగారు. ఈ సమయంలోనే జగన్ సోదరి షర్మిల అన్నకు మద్దతుగా పాదయాత్ర చేపట్టారు. ఇక గత ఏడాది తన తండ్రి, దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు జూలై 8వ తేదీన తెలంగాణలో వెఎస్సార్ టీపీ  పార్టీని ఏర్పాటు చేసి.. పట్టువిడవని ఆత్మస్థైర్యంతో ముందుకువెళ్తున్నారు. ప్రస్తుతం జగన్, షర్మిల చిన్నతనంలో దిగిన ఫోటో ఇంటర్నెట్ వేదికగా ట్రెండ్ అవుతోంది.

Also Read: కళ్లు చెదిరే ఆఫర్‌ ప్రకటించిన తెలంగాణ పోలీస్ శాఖ.. పెండింగ్ చలాన్లు ఉన్నవారికి గుడ్ న్యూస్

Cloves: లవంగాలతో దిమ్మతిరిగే ప్రయోజనాలు .. కనీసం మీ ఊహకు కూడా అందవు