లెక్కల ప్రశ్నకు హృదయాలు దోచుకుంటోన్న విద్యార్థి సమాధానం

| Edited By:

Mar 14, 2019 | 10:34 AM

లెక్కల ప్రశ్నకు ఏడోతరగతి విద్యార్థి రాసిన సమాధానం అందరి హృదయాలను దోచుకుంటోంది. లెక్క చేస్తూనే చివర్లో ఆ విద్యార్థి రాసిన సమాధానం పేపర్ దిద్దుతున్న టీచర్ మనసును గట్టిగా తాకింది. దీంతో ఆమె తనకు తెలిసి వారికి ఆ ఆన్సర్ షీట్‌ను ఫొటో తీసి షేర్ చేయగా.. రాజగోపాల్ అనే నెటిజన్ దాన్ని ఆ ఫొటోను ట్విట్టర్‌లో పెట్టారు. It is a Maths question. But look at the last line. This student […]

లెక్కల ప్రశ్నకు హృదయాలు దోచుకుంటోన్న విద్యార్థి సమాధానం
Follow us on

లెక్కల ప్రశ్నకు ఏడోతరగతి విద్యార్థి రాసిన సమాధానం అందరి హృదయాలను దోచుకుంటోంది. లెక్క చేస్తూనే చివర్లో ఆ విద్యార్థి రాసిన సమాధానం పేపర్ దిద్దుతున్న టీచర్ మనసును గట్టిగా తాకింది. దీంతో ఆమె తనకు తెలిసి వారికి ఆ ఆన్సర్ షీట్‌ను ఫొటో తీసి షేర్ చేయగా.. రాజగోపాల్ అనే నెటిజన్ దాన్ని ఆ ఫొటోను ట్విట్టర్‌లో పెట్టారు.

‘‘ఇది ఒక లెక్కల ప్రశ్నకు సమాధానం. ఆ చివరి లైన్ చూడండి. గణితశాస్త్రానికి మించి ఆ విద్యార్థి ఆలోచించాడు. ఈ పేపర్‌నో నాతో పంచుకున్న టీచర్ ఆనందంలో తబ్బుబ్బిపోతోంది’’ అంటూ ఆయన కామెంట్ పెట్టారు. దీనికి నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరూ గమనించని విషయాన్ని ఆ అబ్బాయి ఆలోచించాడు. ఆ అబ్బాయిని చూసి తల్లిదండ్రులు, టీచర్లు గర్వపడాలి అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఓ మహిళ 15నెలల్లో రూ.18వేలు సంపాదిస్తూ ఆమె నెల సంపాదన ఎంత? ఏడు నెలలకు ఎంత సంపాదిస్తుంది? రూ.30వేలు సంపాదించాలంటే ఎన్ని నెలలు పనిచేయాలి? అన్న ప్రశ్నకు సమాధానాలు రాసిన ఆ కుర్రాడు చివర్లో ది విమెన్ ఈజ్ అండర్‌పెయిడ్ అంటూ నేటి మహిళా కార్మికుల పరిస్థితి అద్దంపట్టేలా వాఖ్యం రాశాడు. అయితే ఈ విద్యార్థి, టీచర్‌కు సంబంధించిన వివరాలు మాత్రం బయటకు రాలేదు.