ఓరీ దేవుడో.. ఇదేం వ్యాపారం బాబోయ్.. ఇంట్లోనే 20 రకాల విష సర్పాలను పెంచుతున్నాడు.. వాటితో..

|

Sep 27, 2023 | 6:46 PM

ప్రభుత్వం, అటవీ శాఖ నుండి ఎటువంటి అనుమతి లేకుండా ఇంట్లో 16 విషపూరిత, 9 విషరహిత జాతులకు పైగా పాములను పెంచుతున్నట్టుగా గుర్తించారు. అక్రమంగా జనావాసాల మధ్యలో పాములను పెంచుతున్న వ్యక్తి సందీప్ అలియాస్ దీపుగా గుర్తించారు. అక్రమంగా పాములను పెంచుతున్న సందీప్‌ను అధికారులు అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు.

ఓరీ దేవుడో.. ఇదేం వ్యాపారం బాబోయ్.. ఇంట్లోనే 20 రకాల విష సర్పాలను పెంచుతున్నాడు.. వాటితో..
Snake Business
Follow us on

ఈ ప్రపంచంలో ఎంతో మంది ఎన్నో రకాల పనులు చేస్తూ జీవిస్తుంటారు. జీవనోపాధి కోసం చాలా మంది చాలా రకాల ఉద్యోగాలు, ఉపాధి పనులు చేస్తుంటారు. కొందరు కొందరు ఏసీల్లో కూర్చుని ఉద్యోగం చేస్తుంటే.. కొందరు ఎండా వానలకు ఓర్చుకుంటూ వ్యవసాయం చేస్తుంటారు.. కొందరు పశువుల పెంపకం చేస్తుంటారు. కొందరు పెంపుడు జంతువులతో వ్యాపారం చేస్తుంటారు.. ఇలా అనేక మంది అనేక పనులు చేస్తుంటారు.. కానీ, ఇక్కడో వ్యక్తి మాత్రం ఎవరూ ఊహించని పనిచేస్తున్నాడు. అతడు తన ఇంట్లోనే విష సర్పాలను పెంచుతున్నాడు. పాము విషాన్ని తీసి అమ్మడం అతని వ్యాపారం! చుట్టూ జనాలతో రద్దీగా ఉండే ప్రాంతంలోనే అతడు ఇలాంటి అక్రమ వ్యాపారం చేస్తున్నాడు.. అందుకే.. మన పక్కింటి వారి గురించి మనం కొంచెం అయినా తెలుసుకోవాలి. లేదంటే మన ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉంటున్న వారి గురించి తెలియకపోతే అది మనకే ప్రమాదం.. ఎందుకంటే.. కొన్ని కొన్ని సందర్బాల్లో మన పక్కింట్లో వాళ్లు చేసే కార్యకలాపాల ప్రభావం మనపై కూడా పడుతుంది. అచ్చంగా ఇదే జరిగింది కర్ణాటక రాష్ట్రం మైసూరులో. . మైసూర్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి తన ఇంట్లో 9 రకాల పాములను పెంచుకున్నాడు. సీఐడీ అటవీ శాఖ అధికారులు దాడి చేయడంతో పాముల పెంపకం గురించి ఇరుగుపొరుగు వారికి తెలిసింది. దాంతో వారంతా ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. తమ ఇంటి పక్కనే ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదంటూ నోరెళ్ల బెట్టారు. వివరాల్లోకి వెళితే..

అవును.. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అక్రమంగా 9 రకాల పాములను ఇంట్లో భద్రపరిచినందుకు ఓ వ్యక్తి ఇంటిపై సీఐడీ మైసూర్ ఫారెస్ట్ సెల్ అధికారులు దాడి చేశారు. ఈ సమయంలో, అతను ప్రభుత్వం లేదా అటవీ శాఖ నుండి ఎటువంటి అనుమతి లేకుండా ఇంట్లో 16 విషపూరిత, 9 విషరహిత జాతులకు పైగా పాములను పెంచుతున్నట్టుగా గుర్తించారు. అక్రమంగా జనావాసాల మధ్యలో పాములను పెంచుతున్న వ్యక్తి సందీప్ అలియాస్ దీపుగా గుర్తించారు.

అక్రమంగా పాములను పెంచుతున్న సందీప్‌ను అధికారులు అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. మైసూర్‌లోని తన నివాసంలో 9 రకాల పాములను సేకరించిన నేరం కింద ఇప్పుడు జైలులో ఉన్నాడు. ఇంట్లో ఉన్న పాములను తనిఖీ చేయగా 4 నాగుపాములు, 2 తోడేలు పాములు, 2 ఉంగరపు పాములు, 1 కుక్రి పాములు, 2 మండల పాములు, 2 సరస్సు పాములు, 1 కిల్‌బాక్ పాము, 3 మట్టి పాములను సేకరించినట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

విషసర్పాలు సంచరిస్తున్నాయని సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు జనసాంద్రత అధికంగా ఉండే ఓ నివాస గృహంపై దాడి చేశారు. దాంతో మరో విషయం బయటపడింది.. నిందితుడి ఇంట్లో పాము విషాల తొలగింపు యూనిట్‌ను కూడా నిర్మించిన సంగతి బట్టబయలైంది.. పాము విషం తొలగింపు యూనిట్‌ను అధికారులు సీజ్ చేశారు. వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని వివిధ నిబంధనల ప్రకారం అదుపులోకి తీసుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..