
పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఓ విచిత్ర సన్నివేశం చోటుచేసుకుంది. గ్రౌండ్‌లో ఆసిస్ క్రికెటర్ క్రిస్‌లిన్ తలలోనుంచి పొగలు రావడంతో అందరూ షాక్ తిన్నారు. అవును ఈ దృశ్యం నిజంగా టీవీల్లో దర్శనమిచ్చింది. ఫీల్డింగ్ చేస్తున్న లిన్ తల నుంచి పొగలు రావడంతో..ఆ వీడియో కట్ చేసిన నెటిజన్లు సోషల్ మీడియాలో ఫోస్ట్ చేశారు. అసలు ఇది ఎలా జరిగిందో ఎవరికి అర్థం కావడం లేదు.
రావల్సిండి వేదికగా పెషావర్ జల్మి, లాహోర్ ఖలందర్స్ టీమ్స్ మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. అయితే వరుణుడు ఆటంకం కలిగించడంతో మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన జల్మి జట్టు 7 వికెట్లు కొల్పోయి 132 రన్స్ చేసింది. ఖలందర్స్ బౌలింగ్ మరీ వరెస్ట్‌గా ఉండటంతో లిన్‌కు కోపమొచ్చింది. వారిపై కేకలు వేశాడు. ఆ సమయంలో అతడి బుర్రలోంచి పొగలు రావడం అందరిని ఆశ్యర్యానికి గురిచేసింది. అదేమన్నా జిమ్మిక్కా అంటే లైవ్ చూసినవాళ్లకు కూడా ఆ పొగలు దర్శనమిచ్చాయి. కాగా ఈ మ్యాచ్‌లో 133 టార్గెట్ రీచ్ అవ్వలేకపోయిన ఖలందర్స్, 16 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Never seen anything like this. Serious heat ? pic.twitter.com/qRj2T5knc7
— Mazher Arshad (@MazherArshad) February 28, 2020