ఆరు నెలలుగా పీరియడ్స్‌ రావడం లేదని ఆస్పత్రికి వెళ్లిన మైనర్‌ బాలిక.. స్కానింగ్‌ రిపోర్ట్‌ చూసి అంతా షాక్..

కొంతమందికి గోర్లు కొరికే అలవాటు ఉంటుంది. మరి కొంతమంది వస్త్రం, దారం లేదా మట్టి తింటారు. చాలా అరుదుగా జుట్టు కూడా తింటారని మనం వింటూ ఉంటాం. ఇటీవల వైద్యులు ఒక మైనర్ బాలిక కడుపులో నుండి 6 కిలోల వెంట్రుకల బంతిని తొలగించారు. ఈ అమ్మాయి గత 6 సంవత్సరాలుగా తన జుట్టును తానే లాక్కొని తింటోందని చెబుతున్నారు.

ఆరు నెలలుగా పీరియడ్స్‌ రావడం లేదని ఆస్పత్రికి వెళ్లిన మైనర్‌ బాలిక.. స్కానింగ్‌ రిపోర్ట్‌ చూసి అంతా షాక్..
Hairball In Stomach

Updated on: Aug 18, 2025 | 8:44 AM

చైనాలో ఓ బాలిక కడుపులో నుంచి 2 కిలోల హెయిర్‌బాల్‌ని వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ఈ 15 ఏళ్ల బాలిక మధ్య చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో నివసిస్తుంది. ఆ అమ్మాయి ముద్దుపేరు నీనీ. నీనీ తన తల్లితో కలిసి పొరుగున ఉన్న హుబే ప్రావిన్స్‌లోని వుహాన్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు వెళ్లింది. ఆ అమ్మాయి చాలా సన్నగా ఉందని, ఆమె ఎత్తు 1.6 మీటర్లు, ఆమె బరువు కేవలం 35 కిలోలు మాత్రమే ఉందని తెలిసింది. ఇది మాత్రమే కాదు.. ఆమెకు ఆరు నెలలుగా రుతుక్రమం జరగలేదు. దీంతో తనకు కడుపులో తీవ్రమైన నొప్పి వస్తోందని నీనీ తన తల్లికి చెప్పింది. నొప్పి చాలా తీవ్రంగా ఉండటంతో ఆమె ఏమీ చేయలేకపోయేది. ఆహారం కూడా తినలేకపోయింది. కూతురి బాధను చూడలేక నీనీ తల్లి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లింది. తన కూతురు గత ఆరేళ్లుగా తన జుట్టు తానే తింటుందని డాక్టర్స్‌కి వివరించింది.

అక్కడ వైద్యులు నీనీకి అన్ని రకాల టెస్టులు చేశారు. రిపోర్ట్స్‌ ఆధారంగా బాలికకు తీవ్రమైన రక్తహీనత ఉందని తేలింది. అంతేకాదు..ఆమె కడుపు వెంట్రుకల్నీ పెద్ద సైజు బంతిలా తయారైనట్టుగా వైద్యులు గుర్తించారు. దీంతో జూలై 14న ఆమెకు ఆపరేషన్ చేసి హెయిర్‌బాల్‌ని తొలగించారు. వైద్యులు ఆమె కడుపు నుండి వెంట్రుకలను బయటకు తీసినప్పుడు అందరూ దానిని చూసి షాక్‌ అయ్యారు. ఈ నెల 5న చెకప్‌ కోసం వచ్చిన నీనీ వైద్యులకు స్వీట్స్‌తో చేసిన బొకేను అందజేసి, కృతజ్ఞతలు తెలిపింది. తన కుమార్తె బరువు పెరుగుతున్నదని, బాగానే కోలుకుంటున్నదని ఆమె తల్లి చెప్పారు.

గతంలో జైపూర్‌లోని సవాయి మాన్ సింగ్ (SMS) ఆసుపత్రిలో ఇలాంటి కేసు నమోదైంది. ఇక్కడ 14 ఏళ్ల బాలిక కడుపు నుండి 210 సెం.మీ పొడవున్న వెంట్రుకలను తొలగించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నివాసి అయిన ఈ 14 ఏళ్ల బాలిక దాదాపు ఒక నెల నుండి కడుపు నొప్పి, వాంతులుతో బాధపడుతున్నట్టుగా తల్లిదండ్రులు చెప్పారు. వైద్యులు ఆమెను పరీక్షించినప్పుడు, ఆమె కడుపులో చాలా గట్టి, పొడవైన గడ్డ ఉందని గుర్తించారు. అనంతరం ఆపరేషన్‌ చేసి కడుపులో పేరుకుపోయిన వెంట్రుకలను తొలగించారు. అప్పట్లో, కడుపులో నుండి తొలగించబడిన అతి పొడవైన వెంట్రుకల ముద్ద ఇదేనని చెప్పుకున్నారు. అంతకుముందు రికార్డు 180 సెం.మీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..