Telugu News Trending Chimpanzee playing number game video was gone viral in social media Telugu news
Video Viral: చింపాంజీలు మనుషులకు దగ్గరి సంబంధం.. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది
మానవులు ఆదిమానవుల నుంచి, ఆదిమానవులు కోతుల జాతుల నుంచి వచ్చారన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే మనుషుల తర్వాత కోతులు, చింపాంజీలను అత్యంత తెలివైన జంతువులుగా పరిగణిస్తారు. ముఖ్యంగా చింపాంజీలను మానవులకు...
మానవులు ఆదిమానవుల నుంచి, ఆదిమానవులు కోతుల జాతుల నుంచి వచ్చారన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే మనుషుల తర్వాత కోతులు, చింపాంజీలను అత్యంత తెలివైన జంతువులుగా పరిగణిస్తారు. ముఖ్యంగా చింపాంజీలను మానవులకు అత్యంత దగ్గరి బంధువులుగా పరిగణిస్తారు. వాటి DNA, మనుషుల డీఎన్ఏ దాదాపు 18 శాతం సరిగ్గా ఉంటుందని, అటువంటి పరిస్థితిలో అవి కూడా మనుషుల మాదిరిగానే ప్రవర్తిస్తాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుతం అటువంటి చింపాంజీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్లిప్ చూసిన తర్వాత చింపాంజీలను మనుషులకు దగ్గరి బంధువులుగా ఎందుకు పరిగణిస్తారమే విషయం మీకే అర్థమవుతుంది. చింపాంజీ కంప్యూటర్ స్క్రీన్‌పై నంబర్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తుంది. అయితే దానికి ఒకటి నుంచి 9 వరకు అన్ని నంబర్లు తెలుసు. 1 నుంచి 9 వరకు ఉన్న సంఖ్యలు స్క్రీన్‌పై కనిపించగానే.. చింపాంజీ చాలా వేగంగా వాటిని క్రమవరసలో టచ్ చేస్తూ ఆటను ముగిస్తుంది. అది కూడా చాలా వేగంగా..
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో లాస్ట్ ఇన్ హిస్టరీ అనే ID పేరుతో ఈ క్లిప్ పోస్ట్ అయింది. ‘చింపాంజీలు అద్భుతమైన జ్ఞాపకశక్తిని కలిగి ఉన్నాయని నిరూపించారు’ అనే శీర్షికతో ట్యాగ్ చేశారు. 56 సెకన్లు నిడివి గల ఈ వీడియోను ఇప్పటి వరకు 8 లక్షలకు పైగా వ్యూస్ రాగా.. వేల సంఖ్యలో లైక్ చేస్తున్నారు. చింపాంజీలు మనుషుల కంటే మెరుగైన షార్ట్ టర్మ్ మెమరీని కలిగి ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు.