Viral Video: ఇలాంటి ఫైట్‌.. నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.. కోడి, కోతి ఎలా కొట్టుకున్నాయో మీరే చూడండి..

Funny Video: కోతులు- కుక్కలు, పిల్లులు-కుక్కలు, పాము- ముంగిస.. ఇలా చాలా జంతువులు ఒకదానికొకటి ఎదురుపడితే ఇక అంతే సంగతులు. ఇక కోతుల విషయానికొస్తే వాటికి ప్రత్యేకంగా ఎలాంటి జంతువులతోనూ జాతివైరం ఉండదు.

Viral Video: ఇలాంటి ఫైట్‌.. నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.. కోడి, కోతి ఎలా కొట్టుకున్నాయో మీరే చూడండి..
Chicken Monkey Fight

Updated on: Sep 27, 2022 | 5:40 PM

Funny Video: సోషల్‌ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా ఇటీవల జంతువుల వీడియోలు బాగా వైరలవుతున్నాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యకరంగానూ ఉంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరలవుతోంది. కొన్ని జంతువుల మధ్య పుట్టుకతోనే జాతి వైరం ఉంటుంది. కోతులు- కుక్కలు, పిల్లులు-కుక్కలు, పాము- ముంగిస.. ఇలా చాలా జంతువులు ఒకదానికొకటి ఎదురుపడితే ఇక అంతే సంగతులు. ఇక కోతుల విషయానికొస్తే వాటికి ప్రత్యేకంగా ఎలాంటి జంతువులతోనూ జాతివైరం ఉండదు. అయితే అవి ఎక్కువగా మనుషులతోనే పొట్లాడుతుంటాయి. ఇంకొన్ని సార్లు పక్షులతో కూడా ఫైటింగ్‌ చేస్తుంటాయి. ఇక ఇప్పుడు అలాంటి వీడియోనే ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా ఉంటుంది. ఇప్పటివరకు ఎవరూ కూడా ఇలాంటి ఫైట్‌ను చూసి ఉండరు. ఇంతకీ ఈ ఫైట్‌ ఎవరెవరికో తెలుసా? కోతికి, కోడికి మధ్య.. అందుకే ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తుంది.

వైరల్‌ అవుతోన్న ఈ వీడియోలో ఒక పెద్ద కొండ అంచున కోతి కూర్చొని ఉంది. అదే సమయంలో ఒక కోడి అక్కడికు వస్తుంది. వెంటనే అక్కడే ఉన్న కోతితో పొట్లాటకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కోడి తన ముక్కుతో కోతిని పొడిస్తే.. కోతి తన చేతితో కోడిని కొడుతూ ఉంది. క్కడికి వచ్చింది. అంతటితో ఆగకుండా కోడితో పోరాటానికి సిద్ధమైంది. చివరకు కోడి కోతిని కిందకు నెట్టే ప్రయత్నం చేసింది. ఇలా రెండూ కూడా హోరా హోరీగా ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటాయి.animalsinthenaturetoday అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్‌ చేసిన ఈ వీడియో నెట్టంట తెగ వైరల్‌గా మారింది. ఇప్పటికే లక్షలాది వ్యూస్‌ వచ్చాయి. అలాగే వేలాదిమంది లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇక ఈ వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు . ఇలాంటి ఫైట్ తమ లైఫ్ లో చూడలేదు.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ అరుదైన వీడియోపై ఒక లుక్ వేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us