Viral Video: చూసుకోవాలి గ‌దా బ్రో.. ఇప్పుడు చూడు ఏమైందో..

|

Oct 14, 2024 | 4:24 PM

చెన్నైలో కదులుతున్న రైలులో డ్యాన్స్ చేస్తూ వేలాడుతుండగా పిల్లర్ ఢీకొని ఓ యువకుడు గాయపడ్డాడు. పిల్లర్‌లలో ఒకదానిని ఢీకొనడంతో అతని రైలులోనుంచి కిందపడి పోయాడు. ఈ ఘటనను బాలుడి స్నేహితుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది.

Viral Video: చూసుకోవాలి గ‌దా బ్రో.. ఇప్పుడు చూడు ఏమైందో..
Train Hits Teen
Follow us on

చెన్నైలో కదులుతున్న రైలులో డ్యాన్స్ చేస్తూ వేలాడుతుండగా పిల్లర్ ఢీకొని ఓ యువకుడు గాయపడ్డాడు. పిల్లర్‌లలో ఒకదానిని ఢీకొనడంతో అతని రైలులోనుంచి కిందపడి పోయాడు. ఈ ఘటనను బాలుడి స్నేహితుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. బాలుడిని చెన్నై మాధవరం ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల అభిలాష్‌ అని తెలుస్తుంది. అతను ఒక ప్రైవేట్ కళాశాలలో మొదటి సంవత్సరం హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతున్నాడు. నిత్యం ఎలక్ట్రిక్ రైలులో తన కళాశాలకు వెళ్తాడు. స్నేహితులతో ప్రయాణిస్తున్నప్పుడు అభిలాష్ రైలు ఫుట్‌బోర్డ్ దగ్గర నిలబడి డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ వీడియో అతన్ని స్నేహితులు రికార్డు చేశారు.

అభిలాష్ రైలు వెనుకకు ఉండి డ్యాన్స్ చేస్తాడు. ఒక సమయంలో వీడియోను చిత్రీకరిస్తున్న అతని స్నేహితుడు అతని వైపు చూడమని చెప్పాడు. పరధ్యానంలో ఉన్న అభిలాష్ వెనుకకు చూస్తూనే ఉన్నాడు ఎలక్ట్రిక్ పోల్‌ను గమనించలేకపోయాడు. స్తంభం అతని తలపై బలంగా తాకింది, దీంతో అతను రైలు నుంచి కిందపడిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ విద్యార్థిని వెంటనే అతన్ని స్నేహితులు రక్షించి చెన్నైలోని రాజాజీ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతను గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై రాయపురం పోలీసులు కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు.

నెటింట్లో హల్‌‌చల్ చేస్తున్న ఈ వీడియోపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఎందుకు రా ఇవ్వన్నీ అని ఒక్కరు కామెంట్ చేశారు. రీల్స్ చేసి ఇప్పుడు ప్రాణాల మీదకి తెచ్చుకున్నావ్ అని మరొకరు కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్య కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని విన్యాసాలు చేసి ప్రాణల మీదకి తెచ్చుకుంటున్నారు.

వైరల్ అవుతున్న వీడియో ఇదిగో:

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి