విక్రమ్ ఆచూకీ కోసం.. నాగ్‌పూర్ పోలీసుల ‘తాయిలం’

| Edited By:

Sep 10, 2019 | 5:32 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్ ఇంకా చంద్రుడిపై ల్యాండ్ అవ్వలేదు. చందమామకు 2.1కి.మీల దూరంలో ఉన్న సమయం నుంచి ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్ అయ్యాయి. దీంతో విక్రమ్ కిందపడి విరిగిపోయిందని వార్తలు వచ్చినా.. ఆర్బిటర్ తీసిన చిత్రాలను పరిశీలించిన ఇస్రో శాస్త్రవేత్తలు విక్రమ్‌కు ఏమీ కాలేదని స్పష్టతను ఇచ్చారు. అంతేకాదు త్వరలోనే ఈ ల్యాండర్‌తో కమ్యునికేట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని వారు పేర్కొన్నారు. దీంతో మరోసారి అందరిలో […]

విక్రమ్ ఆచూకీ కోసం.. నాగ్‌పూర్ పోలీసుల ‘తాయిలం’
Follow us on

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్ ఇంకా చంద్రుడిపై ల్యాండ్ అవ్వలేదు. చందమామకు 2.1కి.మీల దూరంలో ఉన్న సమయం నుంచి ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్ అయ్యాయి. దీంతో విక్రమ్ కిందపడి విరిగిపోయిందని వార్తలు వచ్చినా.. ఆర్బిటర్ తీసిన చిత్రాలను పరిశీలించిన ఇస్రో శాస్త్రవేత్తలు విక్రమ్‌కు ఏమీ కాలేదని స్పష్టతను ఇచ్చారు. అంతేకాదు త్వరలోనే ఈ ల్యాండర్‌తో కమ్యునికేట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని వారు పేర్కొన్నారు. దీంతో మరోసారి అందరిలో ఆశలు చిగురించాయి.

ఇదిలా ఉంటే విక్రమ్ ల్యాండర్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. విక్రమ్ ఎక్కడున్నా ఒక్కసారి పలుకు అంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరైతే మీమ్స్‌ను చేస్తూ తమలోని క్రియేటివిటీని చూపిస్తున్నారు. ఈ క్రమంలో నాగ్‌పూర్ సిటీ పోలీసులు విక్రమ్‌పై వినూత్నంగా ట్వీట్ చేశారు. ‘‘డియర్ విక్రమ్.. ప్లీజ్ రెస్పాండ్ అవ్వు. నువ్వు సిగ్నల్‌ను బ్రేక్ చేసినా.. మేము నీకు చలానా వేయం’’ అంటూ కామెంట్ పెట్టారు. దీనిపై నెటిజన్లు కూడా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. కాగా ఒక్కసారి విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ వస్తే.. అందులోని రోవర్‌ను బయటకు తీసుకురావొచ్చు. దీంతో చంద్రుడిపై అన్వేషణను ప్రారంభించవచ్చు.