Chaddi Baniyan Gang : బాబోయ్‌.. మరోసారి చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌.. ఒకే రాత్రి ఆరు దుకాణాల్లో చోరీ

అర్ధరాత్రి సమయంలో ఓ ఇంట్లోకి చొరబడ్డ ఈ గ్యాంగ్‌ 70 గ్రాముల విలువైన బంగారం, అరటిపళ్లను చోరీ చేసింది. అపహరణకు గురైన బంగారం విలువ రూ.5 లక్షలుగా ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచాన వేశారు.

Chaddi Baniyan Gang : బాబోయ్‌.. మరోసారి చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌.. ఒకే రాత్రి ఆరు దుకాణాల్లో చోరీ
Chaddi Baniyan Gang

Updated on: Sep 06, 2024 | 1:49 PM

మహారాష్ట్రలోని నాసిక్‌‌లో చెడ్డీ గ్యాంగ్‌ వరుసదాడులతో హల్‌చల్‌ చేశారు. నాసిక్‌లోని మలేగావ్‌ ప్రాంతంలో చెడ్డీ-బనియన్‌ గ్యాంగ్‌ బుధవారం అర్ధరాత్రి సమయంలో వరుస చోరీలకు పాల్పడ్డారు. వరుసగా పలు దుకాణాల్లో లూటీకి పాల్పడింది. ఎరువులు, హార్డ్‌వేర్‌, విద్యుత్‌ పంపులు విక్రయించే ఆరు దుకాణాల్లోకి చొరబడ్డ ఈ గ్యాంగ్‌.. రూ. లక్షల విలువైన వస్తువులను అపహరించుకుపోయింది. ఆయా షాపుల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో ఈ ముఠా దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

కాగా, మలేగావ్‌ ప్రాంతంలో మూడు రోజుల క్రితం చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి సమయంలో ఓ ఇంట్లోకి చొరబడ్డ ఈ గ్యాంగ్‌ 70 గ్రాముల విలువైన బంగారం, అరటిపళ్లను చోరీ చేసింది. అపహరణకు గురైన బంగారం విలువ రూ.5 లక్షలుగా ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచాన వేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us