Viral Video: అర్ధరాత్రి BMW కారులో వచ్చి యువతి దొంగతనం.. ఏం కొట్టేసిందో తెలుసా? అస్సలు ఊహించలేరు..

|

Oct 28, 2024 | 10:04 AM

ఖరీదైన కారుల్లో తిరిగే పెద్దొళ్ల బుద్ధులు మరీ ఇంత నీచంగా ఉంటాయా? అనే విధంగా ఉంది తాజా సంఘటన. BMW కారులో అర్ధరాత్రి పూట వచ్చిన ఓ యువతి హీరోయిన్ రేంజ్ లో కారుదిగింది. అనంతరం ఓ షాపు వద్దకు వెళ్లి చుట్టూ ఎవరైనా ఉన్నారా.. అన్నట్లు అటూ ఇటూ చూసింది. ఎవరూ చూడట్లేదని నిర్ధారించుకుని లటుకున..

Viral Video: అర్ధరాత్రి BMW కారులో వచ్చి యువతి దొంగతనం.. ఏం కొట్టేసిందో తెలుసా? అస్సలు ఊహించలేరు..
Woman Stealing Flower Pot
Follow us on

నోయిడా, అక్టోబర్‌ 28: లగ్జరీ కారులో వచ్చిన ఓ యువతి అర్ధరాత్రి చీప్‌గా ఓ ఇంటి ముందున్న పూలకుండీని తీసుకుని ఉడాయించింది. చుట్టు పక్కలున్న జనాలు లగ్జరీ కారును, ఆమెను తిప్పితిప్పి చూసి నోటి మీద వేలేసుకున్నారు. ఆమె మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా ఎంచక్కా కారులో పూల కుండీ ఉంచి, డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

నోయిడాలోని ఓ దుకాణం బయట మెరూన్‌ కలర్‌ బీఎండబ్ల్యూ కారు వచ్చి ఆగడం వీడియోలో కనిపిస్తుంది. ఇందులో నుంచి ఓ యువతి దిగి దుకాణం ముందుకు వస్తుంది. అనంతరం అక్కడే ఉన్న పూల కుండీలలో ఒకదానిని ఎంచుకుని కారు డోర్‌ తెరచి అందులో పెట్టడం వీడియోలో కనిపిస్తుంది. మహిళ షాప్‌ ముందున్న పూల కుండీ దొంగిలించడాన్ని గమనించిన స్థానికులు ఆమెతో గొడవకు దిగడం వీడియోలో కనిపిస్తుంది. అయితే సదరు మహిళ సమాధానం విన్న వారంతా షాక్ అయ్యారు. ‘నేను ప్రతిరోజూ ఒక కుండ పూల కుండీ తీసుకెళ్తున్నాను. ఈ మధ్య కాలంలో అదే స్థలం నుంచి మరో రెండు కుండీలు కూడా తీసుకెళ్లాను. భవిష్యత్తులో మరిన్ని కుండీలు దొంగిలిస్తానని’ ఆ మహిళ చెప్పడంతో వారంతా నోరెళ్లపెట్టారు. అనంతరం ఆ మహిళ తన కారులో పూల కుండీతో సహా అక్కడి నుంచి ఉడాచించింది. ఈ సంఘటన శుక్రవారం (అక్టోబర్ 25) రాత్రి 12 గంటల ప్రాంతంలో సెక్టార్-18లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్గా మారింది. కుండీని దొంగిలించేందుకు లగ్జరీ కారులో వస్తున్న మహిళను చూసి నెటిజన్లు సైతం పరేషాన్‌ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమెను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను దీనిని దొంగతనం అని పిలవను, నాకు అవసరమైతే ఉచితంగా తీసుకునిపోతాను అనేలా ఉంది సదరు మహిళ ప్రవర్తన అని ఓ వినియోగదారుడు, ‘ఆమెను వెంటనే అరెస్టు చేయండి’ అని మరో యూజర్‌ కామెంట్‌ సెక్షన్‌లో తెగ సీరియస్‌ అయ్యారు. మన దేశంలో 40 నుండి 45% మంది సొసైటీలో చూపించుకోవడానికి కార్లు కొంటారు. అలాగే ఆమె ఎందుకు కొనిందో, దాని ఫలితం ఏమిటో మన ముందు ఉంచిందని మరొక యూజర్‌ పేర్కొన్నారు. అయితే తాజా ఘటనకు సంబంధించి ఎటువంటి పోలీసు చర్యలు తీసుకోలేదు. సదరు మహిళపై ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.