Viral Video: అయ్యో.. అయ్యో.. అయ్యయ్యో..! ఎరక్కపోయి ఇరుక్కుపోయిన పిల్లి.. వీడియో వైరల్

Cat captured herself in a box: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వైరల్ అయ్యే వాటిల్లో

Viral Video: అయ్యో.. అయ్యో.. అయ్యయ్యో..! ఎరక్కపోయి ఇరుక్కుపోయిన పిల్లి.. వీడియో వైరల్
Cat Funny Video

Updated on: Apr 04, 2022 | 10:01 AM

Cat captured herself in a box: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. తాజాగా.. నెట్టింట ఓ పిల్లికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా పిల్లులు జనం మధ్య తిరుగుతూ అల్లరి చేస్తూ కనిపిస్తుంటాయి. పిల్లుల అల్లరికి సంబంధించిన వీడియోలు నెట్టింట బాగానే వైరల్ అవుతుంటాయి. ఈ రోజుల్లో అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియా (social media) లో హల్‌చల్ చేస్తోంది. ఇది చూస్తే మీరు నవ్వును అస్సలు ఆపుకోలేరు. పిల్లి ఏదో చేయబోయి.. ఇరకాటంలో పడింది. దీనికి సంబంధించిన వీడియో అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.

వైరల్ వీడియోలో ఓ పిల్లి.. ప్లాస్టిక్ బాక్స్ లో ఏదో ఉందని.. చూడాలని ప్రయత్నిస్తోంది. పిల్లి ప్రయత్నం ఫలించదు. ఇంకా కష్టాల్లో పడేస్తుంది. పిల్లి బాక్స్ లో ఏముందో చూసే ప్రయత్నం చేస్తుండగా.. బాక్స్ కిందపడిపోతుంది. దానిలో పిల్లి చిక్కుకుపోతుంది. ఏదైనా తినే పదార్థాలు ఉన్నాయేమో అనుకుంది. కానీ తన ‘ఉచ్చులో’ చిక్కుకుపోతుందని పిల్లి అస్సలు ఊహించి ఉండదు. ఈ ఫన్నీ వీడియో చూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు.

వైరల్ వీడియో..

ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో దోస్తపతి అనే యూజర్ షేర్ చేశారు. దీనికి ఇప్పటివరకు 14 లక్షల వ్యూస్ రాగా.. 1 లక్ష 35 వేల మందికి పైగా లైక్ చేసారు. అదే సమయంలో వీడియో చూసిన తర్వాత నెటిజన్లు పలు రకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. పిల్లి తనంతట తానే ఉచ్చులో పడిందని ఒకరు పేర్కొనగా.. ‘క్యూరియాసిటీ కెన్ ప్రిజన్’ అంటూ మరో యూజర్ పేర్కొన్నారు.

Also Read:

Watch Video: బోర్ కొడుతుందని చేపలు పట్టేందుకు వెళ్లాడు.. చివరకు ఊహించని షాక్.. వీడియో వైరల్

Viral Video: వేల అడుగుల ఎత్తులో ఆగిన విమానం ఇంజిన్.. ప్రాణాలను పణంగా పెట్టి పైలట్ చేసిన పనికి అందరూ ఫిదా!