Cat – Lion: స్క్రీన్ పై ఉన్నా ఎదురుగా ఉన్నా సింహం సింహమే.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..

|

Oct 23, 2022 | 7:37 PM

అడవిలో అనేక రకాల జంతువులు నివసిస్తున్నప్పటికీ.. అడవికి రాజు సింహమే. దానిని మించిన క్రూరమైన జంతువు మరొకటి లేదు. సింహాలను చూస్తేనే చాలు మిగతా అడవి జంతువులు ఆమడ దూరం పరిగెత్తుతాయి. తమ ప్రాణాలు..

Cat - Lion: స్క్రీన్ పై ఉన్నా ఎదురుగా ఉన్నా సింహం సింహమే.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..
Cat Lion Video
Follow us on

అడవిలో అనేక రకాల జంతువులు నివసిస్తున్నప్పటికీ.. అడవికి రాజు సింహమే. దానిని మించిన క్రూరమైన జంతువు మరొకటి లేదు. సింహాలను చూస్తేనే చాలు మిగతా అడవి జంతువులు ఆమడ దూరం పరిగెత్తుతాయి. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు దూరంగా వెళ్లిపోతాయి. సింహాలు జంతువులను వేటాడడం చాలా అరుదుగా కనిపించినప్పటికీ.. అవి ఆకలి వేసినప్పుడు మాత్రమే వేటాడతాయి. ఎరపై సరిగ్గా దాడి చేసి ఆకలి తీర్చుకుంటాయి. అవి దాడి చేసే సమయంలో చాలా వేగంగా, బలంగా విరుచుకుపడతాయి. ఇక వాటి చేతికి చిక్కితే తప్పించుకోవడం అసాధ్యం. మరోవైపు.. కొందరు తమ ఇళ్లల్లో పిల్లిని పెంచుకుంటారు. వాటిని కుటుంబసభ్యులతో సమానంగా చూసుకుంటారు. అయితే సింహం, పిల్లికి సంబంధించిన ఫన్నీ వీడియోను మీరు ఎప్పుడైనా చూశారు. లేకపోతే ఇప్పుడు వెంటనే చూసేయండి. ప్రస్తుతం అలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూస్తే మీరు నవ్వకుండా అస్సలు ఉండలేరు.

ఈ వీడియోలో ఒక పిల్లి టీవీ చూస్తుంటుంది. దానికి తెరపై సింహాలు కనిపించగానే దగ్గరగా వెళ్తుంది. టీవీలో ‘ది లయన్ కింగ్’ సినిమా ప్లే అవుతుండటాన్ని మీరు చూడవచ్చు. ఈ సన్నివేశాన్ని పిల్లి చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తోంది. అదే సమయంలో తెరపై ఓ పెద్ద సింహం దగ్గరగా వచ్చి గట్టిగా గాండ్రిస్తుంది. దాంతో పిల్లి సడన్ గా ఉలిక్కిపడుతుంది. భయంతో వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. పారిపోయే సమయంలో అది నేలపై పడిపోతుంది. ఇది చాలా హాస్యాస్పదమైన దృశ్యం.

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. దీనికి ఇప్పటి వరకు 1 లక్షా 10 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. 6 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. మీరు సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వివిధ రకాల వీడియోలను చూసి ఉంటారు. కానీ ఈ విధంగా సింహాన్ని చూస్తే, మీరు భయంతో పరిగెడుతున్న పిల్లిని చాలా అరుదుగా చూసి ఉంటారు.