ఇంటర్నెట్ పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగిన అది క్షణాల్లో ప్రజలకు చేరిపోతుంది. సోషల్ మీడియా వేదికగా అలాంటి ఎన్నో రకాల వీడియోలు, పోస్ట్‌లు ప్రతినిత్యం వేల సంఖ్యలో వైరల్ అవుతుంటాయి. అందులోని షాకింగ్ ఘటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ప్రమాదాలకు సంబంధించినవి, ఒళ్లు గగ్గుర్పాటుకు గురి చేసేవి అనేక రకాల వీడియోలను ఇక్కడ చూస్తుంటాం..ఇవి చూసేందుకు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే, కొన్ని వీడియోలు భయానకంగా ఉన్నాయి. అలాంటి హృదయాన్ని కదిలించే వీడియో ఒకటి X (ట్విట్టర్)లో షేర్ చేయబడింది. ఈ హృదయ విదారక ఫుటేజ్‌లో, రైల్వే క్రాసింగ్‌ను దాటడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కారు ఎలా ఇరుక్కుపోయిందో.. ఆ తర్వాత తృటిలో ఎలా తప్పించుకుందో వీడియోలో స్పష్టంగా కనిపించింది.. వైరల్ వీడియో ఆధారంగా ఈఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగినట్టుగా కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
వీడియోను చూస్తుంటే, గేటు మూసే సమయంలో కారు రైల్వే క్రాసింగ్‌ను దాటుతున్నట్లు తెలుస్తోంది. అలాంటి పరిస్థితిలో కారు అక్కడ ఇరుక్కుపోయింది. సమీపంలో చాలా మంది ప్రజలు నిలబడి ఉన్నారు. డ్రైవర్ రైలు ట్రాక్‌కి కుడివైపున కారును ఆపేశాడు.. దాంతో ఆనంద్ విహార్ నుండి మోతిహారీకి వెళ్ళే చంపారన్ సత్యాగ్రహ ఎక్స్‌ప్రెస్ వెంట్రుక వాసి దూరంతో సులభంగా వెళ్ళింది. దీంతో కారుకు ప్రమాదం తప్పింది.. అయితే ఇలాంటి సందర్భాల్లో ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ, కారులో ఉన్నవారి అదృష్టం అనుకుంటా..ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం లేకుండానే ప్రమాదం నుండి బయటపడ్డారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావటంతో చాలా మంది కామెంట్స్ చేశారు.
Now that’s what we call a close escape 😂
Also, A part of me wanted the train to give atleast some damage to the car, it would have been a great lesson to the stupid car owner.#indianrailways pic.twitter.com/A5ODUW4Uhh
— Saurabh • A Railfan 🇮🇳 (@trainwalebhaiya) January 15, 2024
ఇప్పటి వరకు ఈ వీడియోని X (గతంలో ట్విట్టర్)లో 1 లక్ష 25 వేలకు పైగా వీక్షించారు. యూపీ 16 రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలు కనిపిస్తే వాటికి దూరంగా వెళ్లడం మంచిదని మరికొందరు సూచిస్తున్నారు. ఎక్స్‌లో, తారక్ రామ్ కిరణ్ అనే వినియోగదారు స్పందిస్తూ.. కారు డ్రైవర్ చాలా తెలివైనవాడని అన్నారు. మరో వినియోగదారు స్పందిస్తూ.. దీన్నే క్లోజ్ రెస్క్యూ అంటారని చెప్పారు. ఈ వీడియోపై ఇంటర్నెట్ వినియోగదారులు స్పందిస్తూ కారు యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. కారు చేసిన పని వల్ల చాలా మంది అమాయక ప్రజల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారు యజమానిపై యుపి పోలీసులు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్‌పిఎఫ్ మరియు స్థానిక పోలీసులు కారు యజమానిపై కేసు నమోదు చేయాలని తగిన చర్యలు తీసుకోవాలని మరికొందరు నెటిజన్లు సూచిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..