Viral Photo: మీ కళ్లకు ఓ పరీక్ష.. ఈ ఫోటోలో ఉన్న జంతువును గుర్తిస్తే మీరే గ్రేట్.. 99% ఫెయిల్!

|

Apr 29, 2022 | 12:04 PM

ప్రస్తుతమంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. పెద్దాచిన్నా అనే తేడా లేకుండా అందరూ సామాజిక మాధ్యమాలకు దాసోహం అవుతున్నారు...

Viral Photo: మీ కళ్లకు ఓ పరీక్ష.. ఈ ఫోటోలో ఉన్న జంతువును గుర్తిస్తే మీరే గ్రేట్.. 99% ఫెయిల్!
Find The Sheep
Follow us on

ప్రస్తుతమంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. పెద్దాచిన్నా అనే తేడా లేకుండా అందరూ సామాజిక మాధ్యమాలకు దాసోహం అవుతున్నారు. ఇక ఫన్‌ను క్రియేట్ చేసే కంటెంట్ నెట్టింట కోకొల్లలు. ముఖ్యంగా ఈ మధ్య ఇంటర్నెట్‌లో ఫోటో పజిల్స్ ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నాయి. సాధారణంగా చాలామంది పజిల్స్ సాల్వ్ చేయడంలో ఆసక్తిని చూపిస్తుంటారు. కొందరు వీకెండ్ బుక్స్‌లోని పద సంపత్తిని.. తగ్గేదేలే అన్నట్లుగా సాల్వ్ చేసేదాకా వదిలిపెట్టరు. పజిల్స్ మన మెదడుకు మేత వేస్తుంటే.. ఇప్పుడు ట్రెండ్ అవుతోన్న ఫోటో పజిల్స్ మెదడుకు చురుకుదనాన్ని, కళ్లకు పదును పెడతాయి. ఇవి సాల్వ్ చేసేందుకు చాలా సమయం పట్టినా.. ఒక్కసారి ఆ ఫోటోలో ఏ జంతువు దాగుందో కనిపెడితే మనకు కిక్కే కిక్కు వస్తుంది. ఈ కోవలోనే తాజాగా ఓ ఫోటో పజిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ గొర్రె దాగుంది. దాన్ని కనిపెట్టడం కొంచెం కష్టమండోయ్. ఎందుకంటే.. కొండలాంటి ఆ ప్రాంతమంతటా పెద్ద పెద్ద రాళ్లు ఉన్నాయి. ఇక ఆ రాళ్లు రంగులో గొర్రె చర్మం ఇమిడిపోయింది. దీనితో నూటికి 99 శాతం మంది దాన్ని సాల్వ్ చేయలేకపోతున్నారు. ఎక్కడుందో కనిపెట్టేందుకు తలలు పట్టుకుంటున్నారు. మరి మీరూ ట్రై చేయండి.. ఫోటోలోని గొర్రెను మీరు 20 సెకన్లలో కనిపెడితే.. మీ కళ్లలో మ్యాజిక్ ఉన్నట్లు.. ఒకవేళ కనిపెట్టకపోతే సమాధానం కోసం కింద ఫోటోను చూడండి..