ఈరోజు మీకోసమే మరో వైరల్ ఆప్టికల్ ఇల్యూషన్ తీసుకువచ్చాను. ప్రస్తుతం ఈ ఇల్యూషన్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇది సామాన్యమైనది కాదు.. ఎందుకంటే ఇందులో ఒక చిన్న సవాల్ కూడా ఉంది. మీరు ఈ సవాల్‌ను స్వీకరించి 7 సెకండ్లలోపు దీనిని పరిష్కరించగలరా..?
ఈ ఇల్యూషన్‌లో కనిపించే చిత్రం గందరగోళంగా ఉన్న గదిని చూపిస్తోంది. ఈ గదిలో అనేక వస్తువులు చిందరవందరగా ఉన్నాయి. కానీ వాటి మధ్యలో దాగి ఉన్న ఓ స్పైడర్ ఉంది. అయితే దాన్ని వెంటనే గుర్తించడం అంత ఈజీ కాదు. స్పైడర్ అక్కడే ఉంది. కానీ అది చుట్టూ ఉన్న వస్తువులతో చాలా సహజంగా కలిసిపోయింది.
ఇప్పుడు మీ పనేమిటంటే మీ దృష్టి సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలి. ఈ గదిలో దాగి ఉన్న స్పైడర్‌ను కేవలం 7 సెకండ్లలో గుర్తించాలి. ఇది తేలికైన పని అనుకుంటే.. ఇప్పుడే ప్రయత్నించండి. ఈ సవాల్‌ను అధిగమించి మీ గమనించే శక్తి ఎంతటిదో నిరూపించుకోండి. మీరు నిజంగా స్పైడర్‌ను వేగంగా కనిపెట్టగలిగితే మీ కళ్ళు అత్యంత శక్తివంతమైనవని చెప్పొచ్చు. ఇంకా మీ మెదడు కూడా చాలా చురుకుగా పని చేస్తున్నట్లే.
ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు ఎందుకు ఈతరం ప్రజల్ని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయంటే.. ఇవి మన గ్రహించే విధానాన్ని పూర్తిగా మోసగిస్తాయి. మనం ఒకటి చూస్తున్నామనుకుంటాం. కానీ నిజంగా చూస్తున్నది వేరే అయి ఉండొచ్చు. మన మెదడు కొన్ని సందర్భాల్లో అందుబాటులో ఉన్న అన్ని వివరాలను గుర్తించలేకపోతుంది. దీని వల్ల మన పరిశీలనా శక్తి పెరుగుతుంది, దృష్టి కేంద్రీకరణ మెరుగవుతుంది, సమస్యలను వేగంగా పరిష్కరించే నేర్పు పెరుగుతుంది.
ఇలాంటి పజిల్స్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంటాయి. ఎందుకంటే చాలా మంది తమ ఫలితాలను ఇతరులతో పంచుకోవడం ఇష్టపడతారు. పైగా ఒకరు తక్కువ సమయంలో కనుగొంటే, మరొకరు ఎక్కువ సమయం తీసుకుంటే, వారిద్దరి మధ్య చిన్నపాటి పోటీ మొదలవుతుంది. స్నేహితులను సవాల్ చేస్తూ నీకు ఎంత టైమ్ పట్టింది..? అని ప్రశ్నించుకుంటూ పాల్గొనే ఈ ఛాలెంజ్ మరింత ఉత్సాహంగా మారుతుంది. కొన్నిసార్లు సమాధానంపై వాదనలు కూడా జరుగుతాయి. ఏది నిజమైన సమాధానం..? అసలు స్పైడర్ ఎక్కడుంది..? అని చర్చించుకుంటారు.
మీరు స్పైడర్ ని కనిపెట్టారా.. హో అయితే మీకు అభినందనలు. ఇంకా కనిపెట్టనివారు మరోసారి బాగా ఫోకస్ చేసి చూడండి. అయినా కనపడకపోతే చింతించకండి. నేను బ్లాక్ సర్కిల్ చేసి ఉంచాను దాంట్లో స్పైడర్ ఉంది వెళ్లి చూడండి. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లలో తరచూ పాల్గొంటూ ఉండండి. అప్పుడు ఇచ్చిన సమయం కంటే కూడా వేగంగా పజిల్ ని కనిపెట్టగలగుతారు.