Animal Illusion Picture: మీరు సోషల్ మీడియా(Social Media) యూజ్ చేస్తారా..? అయితే ఫోటో పజిల్స్ కూడా ఈ మధ్య మీ కంటపడే ఉంటాయ్. ఇవి ఈ మధ్య నెటిజన్ల అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నాయ్. ఆటపట్టిస్తూ.. చిక్కుముళ్లుగా అనిపిస్తాయి. ఎంతసేపు చూసినా కనిపించక కాస్తంత అసహనాన్ని కలిగిస్తాయి. అయితే వాటిని సాల్వ్ చేస్తే మాత్రం.. మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అయితే ఈ ఫోటో పజిల్స్ మీ ఐ పవర్ ఎంతో చెప్పేస్తాయి. అయితే కాస్త పేషెన్స్ అవసరం.. అరె మాకు అందులోని వస్తువు లేదా జంతువు దొరకడం లేదని వెంటనే ఆన్సర్ చూస్తే ఆ మాత్రం కిక్ ఉండదు. తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటో ఓ పర్వత ప్రాంతంలో తీసిందిగా అర్థమవుతుంది. అందులో 3 చిరుతలు దాగి ఉన్నాయి. వాటిని కనిపెట్టం కత్తి మీద సామే. ఎందుకంటే కొందరు 1,2 చిరుతలు కనిపెడుతున్నారు కానీ మొత్తం 3 కనిపెట్టలేకపోతున్నారు. ఒకవేళ కొద్ది నిమిషాల్లోనే మీరు 3 చిరుతలను కనిపెడితే మీ కంటి చూపుల్లో తీక్షణత ఉందనే చెప్పాలి. ఎంతసేపు చూసినా.. మా వల్ల కాదు అనిపిస్తే ఇక చేసేదేం లేదు కిందన చిరుతల ఉన్న చోట సర్కిల్స్ చేసి ఉన్న ఫోటోను ఇచ్చాం. అక్కడ చెక్ చేయండి. ప్రజంట్ ఈ క్లిష్టమైన పజిల్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.