Puzzle: బుర్ర వాడితే చాలా సింపుల్.. ఈ చిన్న క్విజ్ కూడా సాల్వ్ చేయలేరా..?

|

May 12, 2022 | 2:36 PM

ఈ పజిల్‌ను కిడ్స్ అయితే నిమిషాల్లో సాల్వ్ చేస్తారు.. మీరు ఎంత సేపట్లో పరిష్కరించగలరో చూడండి. వెంటనే ఆన్సర్ చూస్తే మాత్రం కిక్ పోతుంది. కాస్త ఆలోచించి.. ఇక కష్టం అనుకుంటేనే కిందకు వెళ్లి జవాబు చూడండి.

Puzzle: బుర్ర వాడితే చాలా సింపుల్.. ఈ చిన్న క్విజ్ కూడా సాల్వ్ చేయలేరా..?
Puzzle(Image: Reddit)
Follow us on

Quiz: కడుపుకి మేత వేస్తున్నారు.. ఎనర్జీ కోసం.. మరి బుర్ర యాక్టివ్‌గా పనిచేయాలంటే దానికి కూడా కాస్త మేత వేయాలి కదా..! లేకపోతే.. అది మొద్దుబారిపోతుంది. బుర్రకి మేతా..? ఎలా అని కళ్లు ఎగరేసి చూడకండి. రకరకాల పజిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి. వాటి అంతు చూడండి. మీ బుర్రలో ఎంత విషయం ఉందో తెలుసుకోండి. అవును.. ఈ మధ్య కాలంలో చాలా రకాల పజిల్స్ మా సైట్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాం. అందులో కొన్ని ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూజన్స్ ఉన్నాయి. అవి మీకు మాంచి కిక్ ఇచ్చాయని అర్థమైంది. అందుకే మీ కోసం మరో క్రేజీ పజిల్ తీసుకొచ్చాం. ఇది చాలా సింపుల్. కాకపోతే కాస్త మైండ్ పెట్టి క్రియేటివ్‌గా చూడాలి. ఎల్.కే.జీ, యూ.కే.జీ చదువుతున్న పిల్లలైతే ఈ పజిల్‌ను  నిమిషాల్లో సాల్వ్ చేస్తారు. ఎందుకంటే స్కూల్లో టీచర్స్ వారికి ఈ పజిల్స్ సాల్వ్ చేయడం నేర్పిస్తారు. మీరు మాస్టర్స్ చేసి ఉంటారు.. లేదా డిగ్రీ పాసై ఉంటారు.. కనీసం టెన్త్ పాసో, ఫెయిలో అయి ఉంటారు కదా.. మీ అపారమైన మేథాశక్తితో ఈ పజిల్ సాల్వ్ చేయండి చూద్దాం.

ఈ పజిల్ పరిష్కరించడానికి మరింత సమయం కావాలా?.. అయితే కానివ్వండి..

 

పైకి స్క్రోల్ చేసి… ఇంకోసారి ట్రై చేయండి. మీ సమయాన్ని ఇంకొంత వెచ్చించండి.

 

ఏంటి అస్సలు చిక్కు వీడటం లేదా..? అయితే ఇక మేమే చెప్పేస్తాం…!

సమాధానం ఏంటంటే… మీరు ప్రతి సంఖ్యలో ఎన్ని సర్కిల్స్ ఉన్నాయో లెక్కించాలి. ఉదాహారణకు, 2581 ఉంది అనుకోండి. అందులో 8 సంఖ్యలో 2 సర్కిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఆన్సర్ 2. ఇక 8809 సంఖ్య ఉందనుకోండి.. అందులో రెండు ఎనిమిదులు ఉన్నాయి కాబట్టి.. 4 సర్కిల్స్, సున్నాలో ఒక సర్కిల్.. 9లో ఒక సర్కిల్ ఉంది.. సో మొత్తం.. 6 సర్కిల్స్ ఉన్నాయన్న మాట. ఈ లెక్కన 2581లో..8 సంఖ్య ఉంది కాబట్టి 2 సర్కిల్స్ ఉంటాయి.. ఇక్కడ ఆన్సర్…2. ఇతనా సింపుల్. అరె, ఇంత ఈజీ కనిపెట్టలేకపోయామే అనిపిస్తుందా..?. అంతే గురూ కాస్త బుర్ర పెట్టాలి మరీ.