Photo Puzzle: మీ ఐ పవర్ ఏ రేంజిదేంటీ.? ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టగలరా

చల్ల.. చల్లని వాతావరణం.. పైగా దానికి తోడు వేడివేడిగా మిర్చి బజ్జీ ఉంటే.. ఆ టేస్టే వేరబ్బా అంటారు. ఇక ఈ రెండింటితో పాటు కొంచెం మీ మెదడును కూడా రిలాక్స్ చేసేందుకు ఓ కూల్ ఫోటో పజిల్ ఉంటే.. ఆ కిక్కే అమోఘం.

Photo Puzzle: మీ ఐ పవర్ ఏ రేంజిదేంటీ.? ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టగలరా
Photo Puzzle

Updated on: Oct 05, 2024 | 12:00 PM

చల్ల.. చల్లని వాతావరణం.. పైగా దానికి తోడు వేడివేడిగా మిర్చి బజ్జీ ఉంటే.. ఆ టేస్టే వేరబ్బా అంటారు. ఇక ఈ రెండింటితో పాటు కొంచెం మీ మెదడును కూడా రిలాక్స్ చేసేందుకు ఓ కూల్ ఫోటో పజిల్ ఉంటే.. ఆ కిక్కే అమోఘం. మరి మీకోసం ఓ ఫోటో పజిల్ తీసుకొచ్చేశాం. మీ బుర్రను.. మీ చూపునకు మడతపెట్టేసే తికమక పజిల్ ఇది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఎన్నో రకాల ఫోటో పజిల్స్ వైరల్ అవుతున్నాయి. వాటిలో ఒకటి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.

ఇవి మన కాలక్షేపాన్ని కూలసాగా చేయడమే కాదు.. మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. వీటిపై నెటిజన్లకు కూడా విపరీతమైన ఆసక్తి ఉంది. తాజాగా ఈ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ ఇంటర్నెట్‌లో తెగ సందడి చేస్తోంది. పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? అందులో ఓ చిరుత మనతో హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతోంది. అది ఎక్కడుందో కనిపెట్టడమే మీముందున్న టాస్క్. మరి ఫోటోను పైపైన చూడకండి. తీక్షణంగా చూస్తే ఆ చిరుతను కనిపెట్టడం పెద్ద కష్టమేమి కాదు. మీ ఐ పవర్ ఏ రేంజిదో ఈ ఫోటో పజిల్ చెప్పేస్తది. మరి లేట్ ఎందుకు.. ఈ ఫోటోలో దాక్కున్న చిరుతను పసిగట్టేయండి. మీ బ్రెయిన్ పనితీరును, కంటి చూపునకు ఓ పరీక్ష పెట్టేయండి. ఒకవేళ ఎంత వెతికినా ఆ చిరుత కనిపించలేదా? మరేం పర్వాలేదు. డోంట్ వర్రీ.. చిరుత ఎక్కడుందో కింద ఫోటోలో మార్క్ చేసి చూపించాం. అందులో ఆ దాక్కున్న చిరుతను మీరూ చూసేయండి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో హోటల్ రూమ్‌కు.. తెల్లారేసరికి సీన్ ఇది.. అసలేం జరిగిందంటే

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us