ప్రజంట్ సోషల్ మీడియా(Social Media) ఏ రేంజ్‌లో జనాల్ని ప్రభావితం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెద్దలు, చిన్నలు అని లేదు… అందరూ సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు పజిల్స్(puzzles) బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీటిని సాల్వ్ చేసేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. కొంతమంది పజిల్ కనబడితే చాలు.. దాని లెక్క తేల్చకుండా వదిలిపెట్టరు. పజిల్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతాయి. మెదడుకు మేతగా కూడా ఉపయోగపడతాయి. అయితే పజిల్స్ అంటే వీకెండ్ బుక్స్, మ్యాగ్‌జైన్స్‌లో వచ్చేవి మాత్రమే కాదు. ఫోటో పజిల్స్ కూడా ఉంటాయి. ‘ఈ ఫోటోలో జంతువును కనిపెట్టండి’.. ‘ఈ చిత్రంలో ఏయే జంతువులు ఉన్నాయి’ లాంటి ఫోటో పజిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని సాల్వ్ చేయడం మీరనుకున్నంత ఈజీగా కాదు. వీటిని సాల్వ్ చేయాలంటే మీ చూపుల్లో పవర్ ఉండాలి… బుర్రలో పదును ఉండాలి. లేదంటే ఇవి మిమ్మల్ని తికమక పెడతాయి. ఎంతసేపు ట్రై చేసినా వీడని చిక్కుముడిలాగే అనిపిస్తాయి. అయితే సదరు ఫోటోలోని జంతువును లేదా వస్తువును కనిపెడితే.. అదో రకమైన కిక్ వస్తుంది.
తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. మీరు పైన చూస్తోన్న ఫోటోలో ఓ పాము దాగుంది. అక్కడి గడ్డి రంగులో దాని కలర్ కలిసిపోయింది. దాన్ని కనిపెట్టడం పెద్ద కష్టం అయితే కాదండోయ్. ఎందుకంటే.. నూటికి 50 శాతం మంది ఈ పజిల్ సాల్వ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఫోటోలోని పామును కొద్ది సమయంలోనే కనిపెట్టారంటే మీరు గ్రేట్ అని ఒప్పుకోవాలి. మీరు ఆ పామును కనిపెట్టలేకపోతే కింద ఫోటోను చూడండి.
Also Read: AP: చదివింది ఐటిఐ.. కానీ బ్యాంకులనే దోచేయడానికి బయలుదేరాడు.. కట్ చేస్తే..