వాహ్‌ చాయ్‌.. 16 రకాల మసాలాలతో తయారు చేసిన బటర్‌ టీ.. చాయ్‌ వాలాకు ఇంటర్నెట్‌ ఫిదా..!

|

Oct 20, 2023 | 7:36 AM

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోను ఇప్పటివరకు లక్ష మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై పలువురు కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది సరదాగా కామెంట్లు చేశారు. ఈ టీలో జీలకర్ర, వెల్లుల్లిని కూడా వేయాల్సింది అంటూ కొందరు  సూచించారు. ఈ టీని మీరు కూడా అక్కడికి వెళ్లినప్పుడు తప్పక ఒకసారి రుచి చూడండి అంటూ తెలిసిన వారు సూచించారు.

వాహ్‌ చాయ్‌.. 16 రకాల మసాలాలతో తయారు చేసిన బటర్‌ టీ.. చాయ్‌ వాలాకు ఇంటర్నెట్‌ ఫిదా..!
Butter Flavored Chai
Follow us on

టీ తయారు చేయడం చాలా సులభం. టీ పొడి, పాలు, పంచదార ఉంటే చాలు.. టీ ఈజీగా తయారవుతుంది. అయితే ఈ రోజుల్లో తనకు ఇష్టమైన టీపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు చాలా మంది. టీలో టీ పొడినే కాకుండా వివిధ రకాల ఆహార పదార్థాలను కూడా కలుపుతున్నారు. ఉదయం లేచిన వెంటనే టీ తాగడం మొదలుపెట్టిన భారతీయులకు రాత్రి పడుకునే వరకు టీ అవసరం. ఈ టీ తాగడం వల్ల మీ మూడ్ రిఫ్రెష్ అవుతుంది. కాబట్టి, ఏ పని చేస్తున్నా.. మధ్య మధ్యలో ఛాయ్‌ బ్రేక్‌ తప్పనిసరిగా తీసుకుంటారు. విసుగు, చిరాకుతో ఉన్న వారు అదే టీని మసాలా దినుసులు కలిపి ప్రత్యేకంగా తయారు చేసుకుని తాగుతారు. అల్లం, తులసి, దాల్చిన చెక్కతో సహా మసాలా దినుసులతో కలిసి తయారు చేసే టీ అదరగొడుతుంది. టీ రుచిని మార్చేందుకు వెన్న కలుపుతున్న టీ తయారీదారులను చూశారా..? అవును, టీ చేయడానికి వెన్నను ఉపయోగిస్తున్నారు.. దీన్ని ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం…

చక్కెర ఆరోగ్యానికి హానికరం కాబట్టి చాలా తక్కువ మంది మాత్రమే బెల్లం టీని తయారుచేస్తారు. అయితే ఈ వ్యక్తి టీలో వెన్న వేస్తున్నాడు… ఆయన టీ తయారుచేసే విధానం కూడా వెరైటీగా ఉంది. అతను టీలో 16 రకాల సుగంధ ద్రవ్యాలు, వెన్న, గులాబీ రేకులు (టీ పెటల్స్) వేశాడు. వీటన్నింటితో పాటు టీపొడి కూడా వేశాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ అఫీషియల్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఆ వ్యక్తి ఈ స్పెషల్‌ ఛాయ్‌కి దాల్ మఖానీ, చాహా మఖానీ అనే క్యాప్షన్ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

బటర్ టీ ఎలా తయారు చేస్తారు? : ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో, ఒక వ్యక్తి ముందుగా ఒక గిన్నెలో వెన్నను కరిగించాడు. వెన్న వేడయ్యాక అందులో గులాబీ రేకులను వేయాలి. 16 రకాల మసాలా దినుసులు కూడా కలుపుతారు. చివరగా టీ పొడి, పంచదార, బాదంపప్పు వేయాలి. కొంత సమయం తర్వాత టీ మిశ్రమాన్ని వేడి చేసి, వడకట్టి సర్వ్ చేస్తారు.

ఇది కొత్త టీ పద్ధతి కాదు: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆహారంపై కొత్త ప్రయోగానికి సంబంధించిన వీడియో ఇది. కానీ ఈ టీ రిసిపి కొత్తది కాదు, ఇందులో టీని వెన్నతో కలుపుతారు. దీనికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1945లో టీ అమ్మే వ్యక్తి అతని తాత ఈ బటర్‌ టీని ప్రారంభించాడు. అప్పటి నుంచి బటర్ టీ అమ్ముతున్నారని తెలిసింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోను ఇప్పటివరకు లక్ష మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై పలువురు కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది సరదాగా కామెంట్లు చేశారు. ఈ టీలో జీలకర్ర, వెల్లుల్లిని కూడా వేయాల్సింది అంటూ కొందరు  సూచించారు. ఈ టీని పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో విక్రయిస్తారని. మీరు కూడా అక్కడికి వెళ్లినప్పుడు తప్పక ఒకసారి రుచి చూడండి అంటూ తెలిసిన వారు సూచించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..