Funny Video: ఇదెక్కడి నడకరా అయ్యా..! ఇంత వయ్యారంగా నడిస్తే వరల్డ్ రికార్డ్ ఖాయం..! వైరల్ అవుతున్న వీడియో..

Buffalo's Catwalk: సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలను చూస్తుంటాం. వీటిలో కొన్ని వీడియోలు మనల్ని తెగ నవ్వించేసేవిగా ఉంటాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఓ గేదె నడిచిన నడక నెటిజన్లను..

Funny Video: ఇదెక్కడి నడకరా అయ్యా..! ఇంత వయ్యారంగా నడిస్తే వరల్డ్ రికార్డ్ ఖాయం..! వైరల్ అవుతున్న వీడియో..
Buffalo's Catwalk

Updated on: May 04, 2023 | 5:53 PM

Buffalo’s Catwalk: సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలను చూస్తుంటాం. వీటిలో కొన్ని వీడియోలు మనల్ని తెగ నవ్వించేసేవిగా ఉంటాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఓ గేదె నడిచిన నడక నెటిజన్లను పిచ్చపిచ్చగా నవ్వించేస్తోంది. వయ్యారానికి తగ్గట్టుగా గేదెకు ముఖంపై ఉన్న తాడు దానికి అలంకారంగా ఉంది. ఇలాంటి దృశ్యానికి సంబంధించన వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

_its_peaceful_boy_0416_ అనే ఇన్‌స్టా ఖాతా నుంచి షేర్ అయిన ఆ వీడియోలో ఓ గేదె నడిరోడ్డుపై నడుస్తోంది. అది కూడా క్యాట్‌వాక్ చేసినట్లుగా కళ్లను కదుపుతూ వయ్యారంగా నడవడం మొదలెడుతుంది. కొన్ని సెకన్లపాటే ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ క్రమంలో వీడియోకు ఇప్పటివరకు 2 లక్షలకు పైగా లైక్స్, 36 లక్షలకు పైగా వీక్షణలు లభించాయి. 

ఇవి కూడా చదవండి

ట్రెండ్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి..

మరోవైపు వీడియోను చూసిన నెటిజన్ల కొందరు తమ తమ స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. వీడియో అద్భుతంగా నవ్వుకునేలా ఉందని, అందాల పోటీలకు ఈ టాలెంట్ అవసరమని, ఈ గేదెకు ట్రైనింగ్ ఎవరు ఇచ్చారో కానీ వాళ్లు చాలా గొప్పవారని తమ తమ అభిప్రాయాలను రాసుకొస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..