Viral Video: మాతృ ప్రేమ… పిల్లను కాపాడుకునేందుకు సింహాల గుంపుతో పోరాడిన గేదె.. వీడియో చూస్తే షాక్ అవుతారు

జంతువవులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. జంతువుల వీడియోలు ఎదో ఒకటి రోజూ వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా అడవి మృగాలు సంబంధించినవి.. సింహాలు , పులులు వేటాడటం సహజమే..

Viral Video: మాతృ ప్రేమ... పిల్లను కాపాడుకునేందుకు సింహాల గుంపుతో పోరాడిన గేదె.. వీడియో చూస్తే షాక్ అవుతారు
Viral Video
Follow us

|

Updated on: Apr 01, 2022 | 8:53 PM

Viral Video: జంతువవులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. జంతువుల వీడియోలు ఎదో ఒకటి రోజూ వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా అడవి మృగాలు సంబంధించినవి.. సింహాలు , పులులు వేటాడటం సహజమే.. ఆహారం కోసం అవి వేటాడటం వాటి ధర్మం..  సింహాలు , చిరుతపులులు ఎరను పట్టుకోవడానికి ఎంతో ఓపికగా మాటు వేసి పట్టుకుంటాయి.  వాటి నుండి తప్పించుకోవడానికి ఇతర జంతువులు ఎన్నో రకాలుగా  ప్రయత్నించడం మనం తరచుగా చూస్తుంటాం. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. సింహాల నుంచి తన బిడ్డను రక్షించేందుకు గేదె ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓ గేదె పిల్ల పై సింహాలు దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు ఆ గేదె పిల్ల చాలా ప్రయత్నించింది. అయితే పిల్ల గేదెను కాపాడటానికి తల్లి గేదె దైర్యంగా సింహాలతో పోరాడింది. గేదె ఒంటరిగా సింహాల మందకు వెళ్ళింది. ఆ సింహాల గుంపు తన పిల్లను ఏమీ చేయకుండా తన కొములతో కాపాడుకుంది ఆ గేదె.  గేదె ఒంటరిగా ఆ సింహాలను ఎదుర్కొంది.  ఇంతలో ఎక్కడి నుండో గేదెల మంద వచ్చి సింహాలన్నింటినీ తరిమి కొట్టాయి.ఈ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయబడింది. గేదె తన పిల్లను సింహాల నుంచి రక్షించింది’ అనే క్యాప్షన్‌తో వీడియో పోస్ట్ చేయబడింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. నెటిజన్లు ఈవీడియో పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Deepthi Sunaina: బుట్టబొమ్మ అందాలతో అలరింప చేస్తున్న దీప్తి సునైనా లేటెస్ట్ ఫోటోస్

Tiger Nageshwar Rao: టైగర్ నాగేశ్వరరావులో ఒక్కరు కాదు ఇద్దరు ముద్దుగుమ్మలు.. ఎవరెవరంటే..

Paruchuri: అన్నయ్య అలా మారడానికి అదే కారణం.. వైరల్‌ ఫోటోపై స్పందించిన పరుచూరి గోపాల కృష్ణా..