Viral Video: ఓర్ని.. ఇప్పుడే ఇలా ఉందేంటి..! మండపంలోనే వరుడిని పొట్టు పొట్టు కొట్టిన పెళ్లికూతురు..

|

Jul 29, 2022 | 9:47 PM

మండపంలో అందరి బంధువుల సమక్షంలో పెళ్లి తంతు ఎంతో ఘనంగా జరుగుతుంది. అయితే పెళ్లి ఆచారంలో భాగంగా వరుడు తన చేతిని ముందుకు

Viral Video: ఓర్ని.. ఇప్పుడే ఇలా ఉందేంటి..! మండపంలోనే వరుడిని పొట్టు పొట్టు కొట్టిన పెళ్లికూతురు..
Viral Video
Follow us on

ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని వందల వీడియోస్ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని షాకింగ్ గా ఉంటాయి. అలాగే చిన్న పిల్లల ఆటలు, పెళ్లి వీడియోస్ ఉండగా.. మనసుకు హత్తుకునే వీడియోస్ కూడా ఉంటాయి. ఇక ఇటీవల పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అందులో కొన్నింటిలో బంధువులు గొడవ పడితే.. మరికొన్నింటిలో వరుడు, వధువు గొడవ పడుతూ కనిపిస్తారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మండపంలోనే వరుడిని ఓ పెళ్లికూతురు పొట్టు పొట్టుగా కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

మండపంలో అందరి బంధువుల సమక్షంలో పెళ్లి తంతు ఎంతో ఘనంగా జరుగుతుంది. అయితే పెళ్లి ఆచారంలో భాగంగా వరుడు తన చేతిని ముందుకు చాచడానికి ప్రయత్నించాడు. కానీ అనుహ్యంగా వధువు వరుడిపై దాడి చేసింది. వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. అక్కడే ఉన్న బంధువులు వీరి గొడవను ఆపేందుకు ప్రయత్నించగా.. వధువు తన స్థానంలో నుంచి లేచి వరుడిపై తీవ్రంగా దాడి చేసింది. వారిద్దరి మధ్య ఎందుకు గొడవ జరిగిందనే విషయం మాత్రం క్లారిటీ లేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోకు నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.