Viral Video: అత్తవారింటికి వెళ్తూ ఆకస్మాత్తుగా ఏడ్చిన పెళ్లి కూతురు.. అసలు విషయం తెలిస్తే నవ్వకుండా ఉండలేరు.. ఫన్నీ వీడియో వైరల్..

| Edited By: Janardhan Veluru

Jul 07, 2021 | 2:55 PM

ఇటీవల కాలంలో పెళ్లిలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వివాహ వేడుకలో జరిగే కొన్ని సన్నివేశాలు నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తుండగా..

Viral Video: అత్తవారింటికి వెళ్తూ ఆకస్మాత్తుగా ఏడ్చిన పెళ్లి కూతురు.. అసలు విషయం తెలిస్తే నవ్వకుండా ఉండలేరు.. ఫన్నీ వీడియో వైరల్..
Bride Funny Video
Follow us on

ఇటీవల కాలంలో పెళ్లిలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వివాహ వేడుకలో జరిగే కొన్ని సన్నివేశాలు నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తుండగా.. మరికొన్ని కన్నీరు పెట్టించేలా ఉన్నాయి. పెళ్లి ఆడపిల్ల జీవితంలో జరిగే అతి పెద్ద వేడుక.. తల్లితండ్రులను.. తోబుట్టువులను వదిలి పరిచయం లేని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి.. అదే తన కుటుంబంగా భావిస్తుంది. అందుకే పెళ్లి తర్వాత అప్పగింతల సమయంలో ప్రతి ఆడపిల్ల తనవారిని వదిలి వెళ్తున్నందుకు ఏడుస్తుంది. అయితే ఈ వీడియో కూడా అత్తవారింటికి వెళ్లేందుకు సంతోషంగా రెడీ అయిన పెళ్లి కూతురు ఉన్నట్లుండి ఏడవడం ప్రారంభించింది. అయితే ఆ వధువు ఏడుస్తుంది ఎందుకనేది మొదట్లో అర్థం కాకపోయిన.. ఆలోచిస్తే మాత్రం నవ్వకుండా ఉండలేరు. తాజాగా ఆ పెళ్లికూతురు ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కొందరు ఆ వీడియో ఫన్నీ ట్యాగ్స్ ఇస్తున్నారు.

ఆ వీడియోలో.. పెళ్లి తంతు మొత్తం ముగిసిన తర్వాత ఆ వధువు అత్తవారింటికి వెళ్లేందుకు వధువు తరుపు కార్లో సంతోషంగా కూర్చొని తన వారితో ముచ్చటిస్తుంది. అయితే పక్కనే కారుకు మరో వైపు నుంచి పెళ్లి కుమారుడు వచ్చి కూర్చోగా.. అతడిని చూసిన వెంటనే వధువు ఏడవడం ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

అప్పటివరకు సంతోషంగా ఉన్న వధువు.. పెళ్లి కుమారుడిని చూడగానే ఏడ్చిందని.. ఆ అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే వివాహం ఆ అమ్మాయి జీవితంలో సమస్యగా మారిందంటూ మరికొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ వీడియోను చూసెయ్యండి..

ట్వీట్..

Also Read: Cabinet Expansion today: రాష్ట్రపతి భవన్‌ వేదికగా మంత్రులు ప్రమాణ స్వీకారం.. విస్తరణలో 27 మంది కొత్తవారికి ఛాన్స్! చిత్రాలు..

Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..