Viral Video: వరుడికి దిమ్మతిరిగే షాకిచ్చిన పెళ్లి కూతురు.. దెబ్బకు అబ్బాయి సెట్టయ్యాడుగా..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజు. తమ వివాహన్ని ఘనంగా జరుపుకోవాలనుకుంటారు. బంధువులు.. సన్నిహితుల మధ్య ఎంతో

Viral Video: వరుడికి దిమ్మతిరిగే షాకిచ్చిన పెళ్లి కూతురు.. దెబ్బకు అబ్బాయి సెట్టయ్యాడుగా..
Viral

Updated on: Feb 17, 2022 | 1:03 PM

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ప్రత్యేకమైనది. తమ వివాహన్ని ఘనంగా జరుపుకోవాలనుకుంటారు. బంధువులు.. సన్నిహితుల మధ్య ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఇటీవల వివాహాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని నవ్వులు తెప్పిస్తుండగా.. మరికొన్ని మాత్రం అయ్యో పాపం అనిపించేలా ఉంటాయి. అలాగే వధూవరులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని సార్లు అనుకోకుండా జరిగిన సంఘటనల తాలుకూ వీడియోలు మాత్రం పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అబ్బాయిని నూతన వధువు కంటి చూపుతో భయటపెట్టేసింది. ఎందుకో చూద్దామా..

ఆ వీడియోలో పెళ్లి తర్వాత వధువరులిద్ధరూ బంధుమిత్రులతో కలిసి భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో వరుడు.. వధువుకు తెలియకుండా ఆమె విస్తరిలోని వడ తీసుకోవడానికి ప్రయత్నించాడు. వెంటనే వధువు అతన్ని కోపంగా చూసింది. దీంతో వరుడు హడలిపోయి.. ఆ వడను ఆమె విస్తరిలోనే వదిలిపెట్టి బుద్ధిగా భోజనం చేశాడు. దీంతో అతడిని చూసిన వధువు వెంటనే నవ్వేసింది.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Bigg Boss OTT: బిగ్‏బాస్ ఓటీటీ కంటెంస్టెంట్స్ వీళ్లే.. నెట్టింట్లో పైనల్ లిస్ట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Rashmika Mandanna: లవ్ మ్యారేజ్ చేసుకోవడం పై నోరు విప్పిన నేషనల్ క్రష్.. అతడే నా భర్త అంటూ..

Horoscope Today: వీరికి మానసిక ఒత్తిడి ఎక్కువ.. చేసే పనులలో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశి ఫలాలు..

Mirnalini Ravi: ఎర్ర చీరలో వయ్యారాలు వలకబోస్తున్న ‘మృణాళిని రవి’ లేటెస్ట్ ఫొటోస్…

 

Follow Us