Viral Video: ఊ అంటావా మావ పాటకు అదరగొట్టిన పెళ్లి కూతురు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. కన్నడ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించిన లేటేస్ట్ చిత్రం పుష్ప (Pushpa). క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన

Viral Video: ఊ అంటావా మావ పాటకు అదరగొట్టిన పెళ్లి కూతురు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..
Viral Video

Updated on: Feb 09, 2022 | 4:24 PM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. కన్నడ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించిన లేటేస్ట్ చిత్రం పుష్ప (Pushpa). క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్‏లో పాన్ ఇండియా లెవల్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో బన్నీ పక్కా ఊర మాస్ లుక్‏లో చిత్తూరు యాసలో అదరగొట్టాడు. ఇక ఈ సినిమాలోని పాటల గురించి చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ప్రస్తుతం పుష్ప పాటల హవా నడుస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు పుష్ప పాటలకు స్టెప్పులేస్తున్నారు. మరీ ముఖ్యంగా సమంత నటించి స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావ.. ఊహు అంటావా పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈపాటకు సోషల్ మీడియాలో క్రేజ్ ఎక్కువగానే వచ్చింది. ఈ పాటలోని లిరిక్స్.. సమంత కిల్లింగ్ ఎక్స్‏ప్రెషన్స్… ఫోక్ సింగర్ ఇంద్రవతి చౌహన్ మత్తేక్కించే వాయిస్.. అన్ని కలిపి ఊ అంటావా మావ.. ఊహు అంటావా పాట శ్రోతలను మైమరపించింది.

తాజాగా ఈ పాటకు నూతన వధువరులు స్టెప్పులేశారు. ముఖ్యంగా ఈ పాటకు కొత్త పెళ్లి కూతురు వేసిన డాన్స్ ఆకట్టుకుంటుంది. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వధువరులతోపాటు.. అక్కడే ఉన్న బంధువులు సైతం ఈపాటకు అందంగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియో చూడాటానికి ఎంతో ముచ్చటగా కనిపిస్తోంది. నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన నెటిజన్స్ సూపర్ డాన్స్, వధురు అదరగొట్టింది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో పెళ్లి చేసుకున్న జంట.. బంధువులు.. మరాఠీకి చెందినవారిగా కనిపిస్తోంది. కానీ ఈ జంట మాత్రం తెలుగు పాటకు స్టెప్పులేయడం ఆకట్టుకుంటుంది. ఈ వీడియోను మీరు చూసేయ్యండి.

Also Read: Kajal Aggarwal: మీరు బ్రతకండి.. ఇతరులను బ్రతకనివ్వండి.. బాడీ షేమింగ్ చేసినవారికి కాజల్ స్ట్రాంగ్ ఆన్సర్..

Isha Chawla: ప్రేమకావాలి అంటూ ఒకసారి ఎంట్రీ.. డబల్ ధమాకాతో రీఎంట్రీ..’ఇషాచావ్లా’ న్యూ ఫొటోస్..

Meenakshi Chaudhary: అలాంటి సీన్స్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటున్న బ్యూటీ..

Hijab Row: చదువుకునే విద్యార్థుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.. హిజాబ్‌ వివాదం పై స్పందించిన కమల్