ప్రేమ ఎప్పుడు.. ఎలా.. పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. సరిగ్గా ఈ సామెతకు తగ్గట్టుగా బ్రెజిల్‌లో ఓ ప్రేమ చిగురించింది. దొంగతనానికి వచ్చిన దొంగపై మనసు పారేసుకుంది ఓ చిన్నది. అలాగే అతడు కూడా ఆమె అందానికి మైమరిచిపోవడంతో.. ఇప్పుడు వీరిద్దరి ప్రేమ ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..
బ్రెజిల్‌కు చెందిన ఇమాన్యులా అనే యువతి ప్రేమ గురించి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. రోడ్డుపై నడుస్తుంటే.. ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్ దొంగలించాడని, అతనితోనే ప్రేమలో పడినట్టు ఆమె మీడియాతో చెప్పుకొచ్చింది. ఆ దొంగ సైతం మొబైల్‌లో ఇమాన్యులాను చూసి మైమరిచిపోయానని, ఇంత అందాన్ని చూడలేదని చెప్పుకొచ్చాడు. నెటిజన్లు మాత్రం.. ప్రేమ నిజంగానే గుడ్డిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. రెండేళ్ల కిందట బ్రెజిల్‌కు చెందిన ఇమాన్యులా అనే యువతి.. రోడ్డుపై నడుస్తూ వెళ్తుండగా.. ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్ దొంగలించాడు. అనంతరం ఆమె ఫోన్‌లో సదరు యువతి ఫోటోలు, వీడియోలు చూసి.. మైమరిచిపోయాడు. ఆమె అందానికి ఫిదా అయ్యాడు. వెంటనే ఆ చిన్నదానికి తన లవ్ కూడా ప్రపోజ్ చేశాడు. ఇక అమ్మడు కూడా ఆ సమయంలో ఏ మూడ్‌లో ఉందో గానీ దెబ్బకు ఓకే చెప్పేసింది. అప్పటినుంచి ఇద్దరూ కలిసి చెట్టపట్టాలేసుకుని తిరగడం మొదలుపెట్టారు. ఆమె చుట్టుప్రక్కల వాళ్లు ఆ దొంగతో లవ్వేంటని తిట్టినా.. యువతి మాత్రం అవేం పట్టించుకోకుండా.. అతడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. ఇక వీరి ప్రేమ కాస్తా.. ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో.. లవర్స్ ఇద్దరూ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు.
Calma Milton , nossa sociedade é muito sadia mentalmente ainda 🙃 pic.twitter.com/PkaMQkLK54
— Bender B. Rodríguez 🇲🇽 (@BenderEyes) July 21, 2023