పుట్టిన 24 గంటల్లో చనిపోతాడని అనుకున్నారు.. కానీ ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాడు.. అతడెవరంటే.!

|

Mar 29, 2021 | 3:55 PM

Brazil Man With Upside Down Head: ఏదో చేయాలన్న తపన, మనసులో పట్టుదల ఉంటే చాలు మనిషి సాధించలేనిదంటూ ఏదీ ఉండదు....

పుట్టిన 24 గంటల్లో చనిపోతాడని అనుకున్నారు.. కానీ ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాడు.. అతడెవరంటే.!
Man Head 1
Follow us on

Brazil Man With Upside Down Head: ఏదో చేయాలన్న తపన, మనసులో పట్టుదల ఉంటే చాలు మనిషి సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. అంగవైకల్యం ఉన్నా ఓ వ్యక్తి నిరాశ నిస్పృహలకు లోనవ్వలేదు. జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కున్నాడు. చివరికి విజేతగా నిలిచాడు. ఇప్పుడు చెప్పబోయేది ఓ బ్రెజిలియన్ వ్యక్తి కథ. రివెర్స్ తలతో జన్మించిన ఇతగాడు పుట్టిన 24 గంటల్లో చనిపోతాడని వైద్యులు తేల్చేశారు. కానీ అతడి బలమైన ఆత్మస్థైర్యం ముందు మరణం చిన్నడైంది. అతడు ప్రస్తుతం ప్రపంచంలోనే ప్రసిద్ది గాంచిన వ్యక్తిగా పేరొందాడు.

క్లాడియో వెరా డి ఒలివెరా అనే వ్యక్తి బ్రెజిల్‌లోని మోంటే కార్లోలో జన్మించాడు. పుట్టిన సమయంలో, క్లాడియో తల తలక్రిందులుగా మారడంతో పాటు శరీరం మొత్తం కూడాకుదించుకుపోయింది. అతడు జీవించడం అసాధ్యం అని వైద్యులు తేల్చేశారు. 24 గంటల్లో చనిపోతాడని వెల్లడించారు. అయితే ఆ అవరోధాలను జయించిన క్లాడియో ఇప్పుడు అకౌంటెంట్‌గా, మోటివేషనల్ స్పీకర్‌గా మారాడు. చిన్నప్పటి నుంచి తనకు అందరి పిల్లల మాదిరిగానే స్వేచ్చగా జీవించమని తన తల్లి చెప్పిందని.. అందువల్లే ఇప్పుడు ఈ స్థానంలో ఉండగలిగానని క్లాడియో స్పష్టం చేశాడు.

క్లాడియో జన్మించినప్పుడు, అతనికి చాలా సమస్యలు వచ్చాయి. ఆ తరువాత వైద్యులు అతనికి ఆహారం, పానీయాలు ఇవ్వొద్దని సూచించారు. అయినా ఆ అవరోధాలను దాటుకుని క్లాడియో విజయవంతమైన అకౌంటెంట్‌గా మారాడు. చిన్న చిన్న ఇబ్బందులతో చనిపోవాలని అనుకునే వారికి క్లాడియో జీవితం ఓ ఉదాహరణ అని చెప్పవచ్చు.

Also Read: ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక.. ఆ రెండు పథకాల రిజిస్ట్రేషన్లకు రేపే లాస్ట్ డేట్.. త్వరపడండి.!

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు అలెర్ట్.. పలు రైళ్ల సమయాల్లో మార్పులు.. వివరాలు ఇవే.!

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ వేదికగా ప్రకటన.!