ఫోటో పజిల్స్.. మనకు రిలాక్సేషన్‌ను మాత్రం కాదు.. బుర్రకు కాస్త పని కూడా చెప్తాయి. ఇలాంటి పజిల్సే ఇప్పుడు నెట్టింట తరచూ ట్రెండ్ అవుతున్నాయి. పద సంపత్తి లాంటివి ఒక ఎత్తయితే.. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. ఉరఫ్ ఫోటో పజిల్స్ మరో ఎత్తు. వీకెండ్ బుక్స్, మ్యాగజిన్లలో వచ్చే వర్డ్స్ స్క్రిబుల్స్(Word Scribbles), పద సంపత్తిని పెద్దలు ఓ పట్టు పట్టేస్తుంటే.. ఇప్పుడు యువత ఫోటో పజిల్స్‌ను తగ్గేదేలే అన్నట్లు సాల్వ్ చేసేస్తున్నారు. కళ్ళను మభ్యపెట్టడం, బుర్రను తికమక పెట్టడం, ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లుగా చూపించడం.. ఈ ఫోటో పజిల్స్ స్పెషాలిటీ.. మరి అలాంటి ఓ కిక్కేంచే పజిల్‌పై లుక్కేద్దాం పదండి..
పైన పేర్కొన్న ఫోటోను చూస్తున్నారా.? కేవలం మీకు అడవిలోని ఓ ప్రాంతం మాదిరిగా కనిపిస్తుంది. అయితే ఆ చెత్త, ఎండిన ఆకులు, రాళ్లు, చెట్టు మొదలు దగ్గర ఓ పాము కూడా ఉంది. మీరు అనుకున్నట్లుగా అది ఆషామాషీ పాము కాదు.. యమా డేంజర్. అక్కడ ఎవరైనా కాళ్లు పెడితే.. కాటికి ఖాయం. ఆ పాము కూడా అక్కడ ఉన్న ఆకుల రంగులో ఇమిడిపోయింది. అందుకే మీరు బాగా ఫోకస్ పెడితేనే గానీ కనిపించదు. ఇంకెందుకు ఆలస్యం ఫస్ట్ అటెంప్ట్‌లో కనిపెట్టేయండి. ఒకవేళ ఎంత వెతికినా దొరక్కపోతే సమాధానం కోసం కింద ఫోటో చూడండి.