Viral: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. తాళి కట్టే సమయానికి ఎంట్రీ ఇచ్చిన ప్రియుడు.. సీన్ కట్ చేస్తే.!

|

Sep 10, 2022 | 12:05 PM

మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. వధువు మెడలో వరుడు తాళి కట్టే సమయం ఆసన్నమైంది. అంతే! సీన్ కట్ చేస్తే..

Viral: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. తాళి కట్టే సమయానికి ఎంట్రీ ఇచ్చిన ప్రియుడు.. సీన్ కట్ చేస్తే.!
Marriage
Follow us on

మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. వధువు మెడలో వరుడు తాళి కట్టే సమయం ఆసన్నమైంది. అంతే! సీన్ కట్ చేస్తే.. పెళ్లి మండపానికి వచ్చి షాకిచ్చాడు వధువు ప్రియుడు. మొత్తం మీద సినిమా తరహాలో ట్విస్టులు.. తమిళనాడులోని తండయార్‌లో జరిగిన ఈ ఘటనలో చివరికి ఏం జరిగిందంటే..

వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని తండయార్‌కు చెందిన 20 ఏళ్ల సుమతికి.. అదే ప్రాంతంలో నివసిస్తున్న రాజ్ అనే వ్యక్తితో 4 నెలల క్రితం నిశ్చితార్ధం జరిగింది. ఇటీవల వారిద్దరికీ ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఇక మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. వధువు మెడలో తాళి కట్టేందుకు సిద్దమైన వరుడు.. అంతే! ఇంతలోనే కథలో అదిరిపోయే ట్విస్ట్ వచ్చింది. పెళ్లికొచ్చిన అతిధుల్లో నుంచి ఓ వ్యక్తి వేదికపైకి వచ్చి.. వరుడు దగ్గర నుంచి తాళిని లాక్కున్నాడు. దాన్ని వధువు మెడలో కట్టాలని ప్రయత్నించాడు.

ఆ వ్యక్తి ఎవరో కాదు.. మీకర్ధమయ్యే ఉంటుంది. వధువు ప్రియుడండీ మనోడు. అతడు చేసిన పనికి ఒక్కసారిగా షాకైన వధువు అన్న, బంధువులు.. వెంటనే తేరుకుని.. ఆ వ్యక్తి చేతిలో నుంచి తాళిని తీసుకున్నారు. అనంతరం అతడికి దేహశుద్ది చేసి.. పోలీసులకు పట్టించారు. కాగా, పోలీసుల విచారణలో సదరు వ్యక్తి తండయార్‌కు చెందిన సుందరేష్‌గా తేలింది. గతంలో యువతి, ఈ వ్యక్తి కలిసి ఒకే చోట పని చేసేవారని.. ఆ పరిచయం ప్రేమగా మారిందని.. తల్లిదండ్రులను ఒప్పించలేక అతడు ఈ చర్యకు పాల్పడినట్లుగా పోలీసులు నిర్ధారించారు. కాగా, వధువు ప్రియుడి సడన్ ఎంట్రీతో జరగాల్సిన పెళ్లి కాస్తా ఆగిపోయింది.