Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఈ యువకుడి డేంజరస్ స్టంట్ చూస్తే మీరూ షాకవుతారు.!

సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి చాలామంది ఫేమస్ కావడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. కొంతమంది అయితే

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఈ యువకుడి డేంజరస్ స్టంట్ చూస్తే మీరూ షాకవుతారు.!
Stunt

Updated on: Nov 19, 2021 | 5:10 PM

సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి చాలామంది ఫేమస్ కావడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. కొంతమంది అయితే తిక్క పనులు, రిస్కీ స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని మనల్ని ఆశ్చర్యపరిచినా.. మరికొన్ని షాక్ ఇస్తాయి. ఈ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ యువకుడు అతి ప్రమాదకరమైన స్టంట్ ఒకటి చేశాడు. దానిని చూసిన తర్వాత మీరు కూడా ఒక్క క్షణం ఆశ్చర్యపోతారు.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి రోడ్డు మీద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి.. అవతలి వైపుకు దూకడాన్ని మీరు చూడవచ్చు. ఆ వ్యక్తి ఓ ప్రొఫెషనల్ మాదిరిగా స్టంట్ చేశాడు. మధ్యలో చాలా గ్యాప్ ఉన్నా కూడా అతడు అవతలి వైపు గోడను చాకచక్యంగా అందుకోవడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, ఈ వీడియోను ‘ఇన్‌టు_ది_ఫెయిరీస్_వరల్డ్’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ నెట్టింట షేర్ చేయగా.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటిదాకా ఈ వీడియోకు 3 లక్షలకు పైగా వ్యూస్ రాగా.. 2.13 లైకులు వచ్చాయి. అయితే పలువురు దీనిపై భిన్నాభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు. ‘ఇలాంటి స్టంట్స్ ప్రాణానికే ప్రమాదం’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ఇలాంటి విన్యాసాలు చేసే ముందు తమ తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించాలని’ వేరొకరు కామెంట్ చేశారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ పాపులారిటీ సంపాదించుకుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us