Viral Video: బాబోయ్ మరీ ఇలా ఉన్నావేంట్రా..? రెండు చేతుల్లో రెండు పాములు పట్టుకుని హల్‌చల్‌…

ఎట్నుంచి వచ్చాయో తెలియదు గానీ, రెండు పాములు స్పీడ్‌గా పాకుతూ అటుగా వస్తాయి. వాటిని, ఆ బుడ్డొడు భయంతో పారిపోతాడు అనుకుంటే.. అందుకు విరుద్ధంగా ఆ పాములను పట్టుకుని ఆటడాతున్నాడు. ఈ షాకింగ్‌ వీడియో ప్రతిఒక్కరినీ భయపెడుతోంది. చిన్నపిల్లాడు ఇలా పాములతో ఆడుకోవటం పట్ల ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారు.

Viral Video: బాబోయ్ మరీ ఇలా ఉన్నావేంట్రా..? రెండు చేతుల్లో రెండు పాములు పట్టుకుని హల్‌చల్‌...
Child Caught Snake

Updated on: Sep 17, 2025 | 11:45 AM

పాములంటే దాదాపు అందరికీ భయమే ఉంటుంది. అంత దూరంగా పామును చూడగానే పారిపోతారు. కానీ, కొందరు మాత్రం విషపూరిత పాములతో భయానక స్టంట్లు చేస్తుంటారు. కొందరు పాముల్ని మెడలో వేసుకుంటారు.. మరికొందరు పాములకు ముద్దులు పెడుతుంటారు. అప్పుడప్పుడూ చిన్న చిన్న పిల్లలు కూడా పాములతో ఆడుకోవడం చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంటి ఆవరణలో కి వచ్చిన రెండు పాములను ఓ పిల్లాడు రెండు చేతులతో పట్టుకుని ఆడుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో ఒక చిన్నారి బాలుడు తన ఇంటి ఆవరణలో మెట్లపై కూర్చుని ఉండటం కనిపిస్తుంది.. అంతలోనే ఎట్నుంచి వచ్చాయో తెలియదు గానీ, రెండు పాములు స్పీడ్‌గా పాకుతూ అటుగా వస్తాయి. వాటిని, ఆ బుడ్డొడు భయంతో పారిపోతాడు అనుకుంటే.. అందుకు విరుద్ధంగా ఆ పాములను పట్టుకుని ఆటడాతున్నాడు. ఈ షాకింగ్‌ వీడియో ప్రతిఒక్కరినీ భయపెడుతోంది. చిన్నపిల్లాడు ఇలా పాములతో ఆడుకోవటం పట్ల ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

రెండు పాముల తోకలు పట్టుకున్న చిన్నొడు వాటిని అటు, ఇటు తిప్పుతూ ఆడుకుంటున్నాడు. అయినా ఆ పాములు మత్రం బుసలుకొట్టకుండా వాడి చేతిలో ఆటబొమ్మలుగా కదులుతున్నాయి. ఇలా ఆ పిల్లాడు చాలా సేపు ఆ పాములతో ఆడుకోవటం కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే 42 వేలకు పైగా లైక్‌లు, 1.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌తో వీడియో దూసుకుపోతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..