Watch: తెల్లపులి ముందు గుండెపోటుతో కుప్పకూలిన బాలుడు..! ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే షాక్‌ అవుతారు..

|

Aug 10, 2024 | 9:00 PM

అది చూసిన పులి వెంటనే అతని దగ్గరికి వచ్చి తనను లేపే ప్రయత్నం చేస్తుంది. పులి నోటితో అతని నోటిని తడుముతోంది. బాలుడి చేతిని పులి నోట్లో పెట్టుకుని పల్స్‌ చూస్తున్నట్టుగా ప్రవర్తించింది. బాలుడు ఏదో జరిగిపోయిందని కంగారుపడుతుంది. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా..? సాయం చేస్తారా..? అన్నట్టుగా చుట్టూ చూస్తోంది. అంతలో ఎవరికో చెప్పాలన్నట్టుగా ఎక్కడికో పరిగెత్తింది.

Watch: తెల్లపులి ముందు గుండెపోటుతో కుప్పకూలిన బాలుడు..! ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే షాక్‌ అవుతారు..
Pet White Tiger
Follow us on

పెంపుడు జంతువులు తమ యజమానులతో చేసే వింత పనులకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో అనేకం వైరల్‌ అవుతుంటాయి. అలాగే కొన్ని వైరల్‌ వీడియోలలో మీరు సింహాలు, పులును కూడా చూస్తుంటారు. అయితే, మీరు ఎప్పుడైనా సింహం లేదా పులి పెంపుడు జంతువుగా ప్రవర్తించడం చూశారా? వైరల్ వీడియోలో, ఒక బాలుడు పులి ముందు చనిపోయినట్లు నటిస్తూ, అది ఎలా స్పందిస్తుందో తెలుసుకోవాలనుకున్నాడు…ఈ క్రమంలోనే అతడు దాని ముందు ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయారు. ఆ తరువాత జరిగిన సీన్‌ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక బాలుడు తెల్లపులి దగ్గరకు వచ్చి గుండెల్లో నొప్పితో బాధపడుతున్నట్టుగా నటించి కిందపడిపోయాడు. అది చూసిన పులి వెంటనే అతని దగ్గరికి వచ్చి తనను లేపే ప్రయత్నం చేస్తుంది. పులి నోటితో అతని నోటిని తడుముతోంది. బాలుడి చేతిని పులి నోట్లో పెట్టుకుని పల్స్‌ చూస్తున్నట్టుగా ప్రవర్తించింది. బాలుడు ఏదో జరిగిపోయిందని కంగారుపడుతుంది. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా..? సాయం చేస్తారా..? అన్నట్టుగా చుట్టూ చూస్తోంది. అంతలో ఎవరికో చెప్పాలన్నట్టుగా ఎక్కడికో పరిగెత్తింది.

ఇవి కూడా చదవండి

ఇన్‌స్టాగ్రామ్‌లోని అల్షాదహ్మద్ ఖాతా నుండి వీడియో షేర్ చేయబడింది. ఈ పులి బాలుడి పెంపుడు జంతువుగా తెలిసింది. వీరిద్దరికీ సంబంధించిన అనేక వీడియోలు ఇప్పటికే ఈ ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేయబడ్డాయి. నెటిజన్లు కూడా అతని వీడియోలను లైక్‌ చేశారు. కానీ, ఈ వీడియోకి మాత్రం ఇప్పటికే 1 కోటి 23 లక్షల వ్యూస్ వచ్చాయి.

ఈ వీడియో ఇండోనేషియాకు చెందిన అల్షాద్ అహ్మద్. అతను ఈ పులితో మాత్రమే కాకుండా ఇతర పులులు, అనేక ఇతర జంతువులతో కూడా చాలా వీడియోలు చేశాడు. చాలా మంది ఇది చాలా అందంగా ఉందంటూ కామెంట్‌ చేశారు. మరి కొంతమందికి చాలా భయంగా అనిపించిందట. కొంతమంది మాత్రం పులిలో దాగివున్న మానవత్వాన్ని చూసి మురిసిపోతున్నారు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట తెగ హల్‌చల్‌ చేసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..