Viral Video: చిరుత పులి- బ్లాక్ పాంథర్ ఎదురుపడితే ఎలా ఉంటుందో తెలుసా..? డేంజరస్ వీడియో

సోషల్ మీడియాలో నిత్యం జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. జంతువులు చేసే విచిత్రమైన చేష్టలు సోషల్ మీడియాలో కొన్ని సార్లు నవ్వులు పూయిస్తే..

Viral Video: చిరుత పులి- బ్లాక్ పాంథర్ ఎదురుపడితే ఎలా ఉంటుందో తెలుసా..? డేంజరస్ వీడియో
Viral Video

Edited By:

Updated on: Mar 31, 2022 | 10:54 PM

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. జంతువులు చేసే విచిత్రమైన చేష్టలు సోషల్ మీడియాలో కొన్ని సార్లు నవ్వులు పూయిస్తే.. మరి కొన్ని వెన్నులో వణుకు పుట్టిస్థూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చురుతా పులులో చాలా రకాలు ఉంటాయి. వాటిలో మాములు చిరుతలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం.అలాగే నల్లపులి(బ్లాక్ పాంథర్) కూడా అప్పుడప్పుడు మనకు అడవుల్లో తారసపడుతూ ఉంటుంది. చిరుత- బ్లాక్ పాంథర్ ఒకే సారి ఎదురుపడితే పెద్ద యుద్ధమే జరుగుతుంది అంటుంటారు. నిజానికి ఈ రెండు ఎంతో శక్తివంతమైన జంతువులు. రెండింటి సామర్థ్యం సమానమే.. వేటాడే విషయంలోనూ ఈ రెండూ ఒకేలా వ్యవహరిస్తూ ఉంటాయి.

ఈ రెండు మృగాలు ముఖాముఖిగా ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.  ఓ పొడవాటి చెట్టుపై కూర్చొని ఉన్న చిరుతపులిని ఒక బ్లాక్ పాంథర్ గమనించింది. అంతే వెంటనే ఈ చెట్టు పైకి చకచకా ఎక్కేసింది. ఆతర్వాత బ్లాక్ పాంథర్ దగ్గరకు రాగానే చిరుత తన కోపాన్ని ప్రదర్శిస్తుంది. అయితే చిరుత భయాన్ని గమనించిన బ్లాక్ పాంథర్ వెనక్కి తగ్గింది. వెంటనే ఆ చెట్టు పైనుంచి కిందికి దిగేసింది. ఐఎఫ్‌ఎస్ అధికారి సౌరభ్ గుప్తా ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

వైరల్ వీడియో..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ambassador Car: 35 ఏళ్ల ప్రస్థానం.. ఇక సెలవంటూ రిటైర్‌మెంట్ తీసుకున్న ‘అంబాసిడర్’.. రైల్వే శాఖలో బ్యూటీఫుల్ మూమెంట్..!

Funny Video: కంత్రీ పిల్లి.. యాక్టింగ్‌లో ‘ఆస్కార్’ ఇచ్చేయొచ్చు.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..!

srinidhi shetty: పూల ఋతువుల కోమలిలాగ ఫ్యాన్స్ మతి పోగొడుతున్న కేజీఎఫ్ ముద్దుగుమ్మ ‘శ్రీనిధి శెట్టి’..