ప్రపంచంలో ఎన్నో రకాల పక్షులు, జంతువులున్నాయి. అయితే ఒక్కొ పక్షి ఒక్కో విధంగా ప్రవరిస్తూ ఆకట్టుకుంటాయి. అయితే పక్షుల కిలకిలరావాలు అంటే అందరికీ ఇష్టమే కానీ. ఓ పక్షి మాత్రం ఇతర వాటికి భిన్నంగా వ్యవహరిస్తూ జనాలను తికమక చేయడంతో పాటు పోలీసులను చీట్ చేస్తోంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
యూకేలోని ఓ పక్షి అచ్చం పోలీస్ సైరన్ ను మిమిక్రీ చేస్తూ షాక్ ఇస్తోంది. ఈ పక్షి మిమిక్రీ పోలీసులను గొందరగోళం చేయడంతోపాటు ఎంతోమందిని భయపెట్టేలా చేస్తోంది. థేమ్స్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పక్కన ప్రధాన రహదారిపై ఉన్న ఈ పక్షి ప్రయాణికులతోపాటు అధికారులను గందరగోళానికి గురిచేసింది. అయితే అటు పోలీసులు, ఇటు జనాలు బిజీగా ఉన్న సమయంలో ఒక్కసారిగా సైనర్ లా మిమిక్రీ చేస్తూ గురిచేస్తోంది. దీంతో వాహనదారులు పోలీసులు వస్తున్నారేమోనని భయపడుతూ అలర్ట్ అవుతున్నారు. సైరన్ ఒక్కసారిగా మోగుతుండటంతో పోలీసులు అయితే తమ వాహనాలకు దగ్గరికి పరుగులు పెట్టాల్సి వస్తోంది. తమ కార్లు సరైనవిధంగా ఉండటంతో బిత్తరపోతున్నారు.
ఆ తర్వాత రహదారి పక్కన ఉన్న చెట్టుపై నుంచి పక్షి అరుస్తుండటం గుర్తించారు. అయితే పక్షి సైరన్ లా అరుస్తుండటంతో “స్పెషల్ బ్రాంచ్” లేదా “ఫ్లయింగ్ స్క్వాడ్” లో భాగం కావచ్చు వాహనదారులు భావిస్తుండటం ఆసక్తిని రేపుతోంది. అయితే ఈ పక్షిని స్టార్లింగ్గా గుర్తించారు జనాలు. అయితే కొన్ని పక్షులు మాత్రమే మానవ శబ్దాల మాదిరిగా మిమిక్రీ చేస్తున్నాయని అంటున్నారు. ప్రస్తుతం పోలీసుల సైరన్ ను మిమిక్రీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
From our workshops that test out the two tone tune to officers deploying to jobs, this little fella has been sat patiently observing the noise to recreate it! 🐦⬛ pic.twitter.com/p49FhZ3HMj
— Thames Valley Police (@ThamesVP) April 10, 2024