
ఇటీవల గత కొద్ది రోజులుగా విమానాలకు సంబంధించి అనేక రకాల వార్తలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఎఇయర్ ఇండియా విమానంలో తరచూ ఏదో అంశం వివాదాస్పదంగా మారుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో విమానానికి సంబంధించిన షాకింగ్ సీన్ ఇంటర్‌నెట్‌లో కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక పక్షి ప్రాణాంతకంగా విమానంలోకి దూసుకెళ్లింది.. కానీ పాపం.. రక్తపుమడుగులో కిందకు పడిపోయింది. ఆ దృశ్యాలు పైలట్ క్యాబిన్ నుండి రికార్డయ్యాయి. మనసుల్ని కలతపెట్టే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానంతో పక్షి ఢీకొన్న క్షణం అందరినీ కలచివేసింది. ఈ పాత వీడియో సోషల్ మీడియాలో మళ్లీ షేర్ చేయబడి మళ్లీ వైరల్‌గా మారింది.
వీడియోలో, విమానం ల్యాండింగ్ అయినట్లు పైలట్ ప్రకటించడం మనం వినొచ్చు. అతని మాటల తర్వాత ఒక పక్షి ఫ్లైట్ ముందు స్క్రీన్‌ను ఢీకొట్టింది. డిస్ప్లే పై ఒక వైపు రక్తం చిమ్మింది. అందువలన పైలట్లు తర్వాత ల్యాండ్ చేయడానికి డిస్ప్లే మరో వైపును ఎంచుకుంటారు.
2021లో, ఫుటేజ్ Facebookలో షేర్ చేయబడింది. వీడియో వీక్షకులను షాక్‌కు గురిచేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మళ్లీ తెరపైకి వచ్చింది. అరుదైన, కలవరపెట్టే క్షణాన్ని నెటిజన్లను మనస్తాపానికి గురిచేస్తుంది.